Dandruff Treatment: చలికాలంలో సర్వ సాధారణంగా కన్పించే సమస్య డాండ్రఫ్. ఈ సమస్య వల్ల దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా అసౌకర్యానికి గురి చేస్తాయి. ఈ సమస్య అంత త్వరగా పోకపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురౌతుంటాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది అమ్మాయిలకు కేశాలు అందంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే మహిళల సగం అందమంతా కేశాల్లోనే దాగుంటుంది. అయితే చలికాలం వచ్చిందంటే చాలు జుట్టులో పేరుకుపోయే డాండ్రఫ్ తలపై, బట్టలపై కన్పిస్తూ చాలా చికాకు కల్గిస్తుంది. కొంతమందికి అన్ని సీజన్లలోనూ వస్తుంటుంది. కానీ శీతాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. డాండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కెమికల్ ఆధారిత యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడి కేశాల ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు. అందుకే డాండ్రఫ్ సమస్యకు ఎప్పుడూ హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి.


అల్లోవెరాలో అద్భుతమైన యాంటీ‌ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. స్కాల్ప్ మంట, డాండ్రఫ్ సమస్యను చాలా సులభంగా అల్లోవెరా తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఫ్రెష్ అల్లోవెరా జెల్ స్కాల్ప్‌పై రాసి ఓ అరగంచ ఉంచాలి. దురద, డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. ఇక రెండవ చిట్కా బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అనేది అద్భుతమైన ఎక్స్‌ఫోలియెంట్. ఇది డెడ్ స్కిన్ తొలగించేందుకు, డాండ్రఫ్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా మీరు తలను తడుపుకోవాలి. ఆ తరువాత గుప్పెడు బేకింగ్ సోడాను నేరుగా స్కాల్ప్‌కు రాసుకోవాలి. కాస్సేపు ఉంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 


డాండ్రఫ్ తగ్గించే మరో చిట్కా యాపిల్ సైడర్ వెనిగర్. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు చాలా పెద్దమొత్తంలో ఉంటాయి. డాండ్రఫ్‌కు కారణమయ్యే ఫంగస్‌తో పోరాడేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఓ గిన్నెలో నీళ్లు, యాపిల్ సైడర్ వెనిగర్ సమాన పాళ్లలో కలిపి స్కాల్ప్‌కు రాసుకోవాలి. 15-20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.


టీ ట్రీ ఆయిల్‌లో పెద్దమొత్తంలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు డాండ్రఫ్‌ను అరికట్టడంలో ఉపయోగపడతాయి. మీరు చేయాల్సిందల్లా తేయాకు చెట్టు ఆయిల్ కొద్దిగా షాంపూలో కలిపి తలకు రాసుకోవాలి. కాస్సేపు అలా ఉంచిన తరువాత అప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చేస్తే చాలు. ఇక డాండ్రఫ్ నిర్మూలించే మరో చిట్కా కొబ్బరి నూనె. కొబ్బరి నూనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ కావడంతో మంచి ఫలితాలుంటాయి. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి తలకు రాసి మస్సాజ్ చేసుకోవాలి. రాత్రంతా ఉంచుకుంటే మరీ మంచిది. ఉదయం తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.


Also read: High Fat Foods: ఆరోగ్యం కోసం హై ఫ్యాట్ ఫుడ్స్ ఎందుకు తినాలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook