Workout For Belly Fat: ఈ వ్యాయామాలతో ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్‌కు 7 రోజుల్లో చెక్ పెట్టొచ్చు
Belly Fat Workout At Home: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఈ వ్యాయామాలు చేస్తే సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర దృఢంగా కూడా తయారవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
Belly Fat Workout At Home: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు వస్తున్నాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది డైట్‌లను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేక, బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. మౌంటైన్ క్రంచ్, స్టార్ క్రంచ్, ప్లాంక్ సహా పలు రకాల వ్యాయామాలు చేయాడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?:
వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు కూడా వ్యాయామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కింద పేర్కొన్న వీడియోలో సాధనాలు ప్రతి రోజు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం కూడా ఫిట్‌గా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో పాటు బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల
బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు:
అనారోగ్యకరమైన ఆహారాలు తినడం
శరీరక శ్రమ లేకపోవడం
అతిగా మద్యపానం చేయడం
ఒత్తిడికి గురికావడం
ఫాస్ట్ ఫుడ్ తినడం
నిద్రలేమి సమస్యలు
వ్యాయామాలతో పాటు తప్పకుండా వీటిని పాటించాల్సి ఉంటుంది:
గ్రీన్ టీ తాగాల్సి ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్ అతిగా ఉన్న ఆహారాలు తినకూడదు.
ఆహారంలో ఫైబర్ ఉన్న ఆహారాలు తినాల్సి ఉంటుంది.
మద్యం సేవించడం మానుకోవాల్సి ఉంటుంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook