Yoga Asanas For High Blood Pressure: ఆధునిక జీవనశైలి కారణంగా వృద్ధులే కాకుండా యువత కూడా అధిక రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలున్నవారు నిర్లక్ష్యం వహించడం వల్ల గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అధిక రక్తపోటు ఉన్నవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.  అధిక రక్తపోటు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇతర చిట్కాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ యోగాసనాలు వేయడం వల్ల కూడా అధిక రక్త పోటు సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీత్కారి ప్రాణాయామం:
ప్రాణాయామం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.ఈ యోగాసనాన్ని ప్రతి రోజూ వేస్తే..అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా ఒత్తిడి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. సిత్కారి ప్రాణాయామం శరీర ఉష్ణోగ్రతను కేంద్రీకరించి మెదడులోని ఆ కేంద్రాలను ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలోని అన్ని కండరాలను సడలిస్తుంది.ఈ వ్యాయామం చేయడానికి.. మొదట సుఖాసనంలో కూర్చోండి. దీని తర్వాత రెండు దంతాలు కలిసి ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి, కొంత సమయం పాటు శ్వాసను పట్టుకుని ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోండి. ఇలా దాదాపు 10 నుండి 15 సార్లు చేయండి. ఇలా చేస్తే బీపీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.


శవాసన ప్రాణాయామం:
శవాసనం శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. దీని వల్ల మనస్సును ప్రశాంతంగా లభించడమే కాకుండా హై బీపీని తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే దీని కోసం నిటారుగా పడుకోవాలి. పడుకున్న తర్వాత కళ్ళు మూసుకోండి. ఇలా పడుకున్న తర్వాత  రిలాక్స్‌గా  ఉండాల్సి ఉంటుంది. నెమ్మదిగా మీ శరీరంలోని ప్రతి భాగంపై శ్రద్ధ వాహించాల్సి ఉంటుంది. అయితే ఇలా చేసిన తర్వాత లేచి ధ్యానం కూడా చేయాల్సి ఉంటుంది. ధ్యానం చేసే క్రమంలో శ్వాస వేగాన్ని పెంచండి. ఇలా 10 నుండి 15 నిమిషాల పాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తవ్ర అనారోగ్య సమస్యల నుంచి  ఉపశమనం లభిస్తుంది.


కపాల భాతి ప్రాణాయామం:
యోగా చేసేవారు ప్రతి రోజూ కపాల భాతి ప్రాణాయామం చేస్తూ ఉంటారు. ఈ వ్యాయామాన్ని ప్రతి రోజూ చేయడం వల్ల శరీరం నుంచి విషం తొలగిపోతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే ఒత్తిడి సమస్యలతో బాధపడేవారి కూడా కపాల భాతి ప్రాణాయామం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మొదటగా వజ్రాసనంలో కూర్చొని ఉచ్ఛ్వాసము చేసే చర్యను చేయండి. ఊపిరి పీల్చుకుంటూ..పొట్టను లోపలికి నెట్టాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.


ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?


ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook