Yoga For Diabetes Control: ఇన్సులిన్ లోపం వల్ల చాలా రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ లోపం వల్ల మధుమేహం వ్యాధి వస్తుంది. ఒక్క సారి ఈ సమస్య బారిన పడితే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకంగాను మారొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వ్యాధి ఉన్న వారు ఇన్సులిన్‌ పరిమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ ఇన్సులిన్  హార్మోన్ పైనే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి శరీరంలోని చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవాల్సి ఉంటుంది.  క్లోమం సరైన పరిమాణంలో ఇన్సులిన్‌ను విడుదల చేయడం ప్రారంభించడం వల్లే చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. కాబట్టి శరీరంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్‌ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు యోగాసానాలు వేయాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ వేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తడసానానం:
తడసానానం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడండి. పాదాలకు రెండు అంగుళాల గ్యాప్‌ని కూడా ఉంచాల్సి ఉంటుంది.
అంతేకాకుండా భుజాలు కూడా వెడల్పుగా ఉంచి.. తలను మెడ పైన ఉంచాల్సి ఉంటుంది.
ఊపిరి పీల్చుకుంటూ రెండు చేతులను మధ్యలోకి తీసుకొచ్చి వేళ్లను కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తలపైకి తీసుకోవాలి.
రెండు చీలమండలను నెమ్మదిగా పైకి ఎత్తండి.
మొత్తం శరీరంతో పాటు అరచేతులను ఆకాశం వైపు ఉంచండి. ఇలా 20 సెకండ్ల పాటు ఉంచాల్సి ఉంటుంది.
ఇప్పుడు శ్వాస వదులుతూ, మళ్లీ పాత స్థితికి రండి.
ఈ ప్రక్రియ 4-5 సార్లు పునరావృతం చేయాలి.


మండూకాసనం:
మీ కాళ్లను వంచి వజ్రాసనం స్థానంలో కూర్చోండి.
అరచేతి లోపల చేతుల బొటనవేళ్లను ఉంచాల్సి ఉంటుంది.
నాభిని కొద్దిగా లోపలికి నొక్కండి.
శ్వాస వదులుతూ నడుము నుంచి పాదాల వైపుకు వంచాలి. మెడ నిటారుగా ఉంచండి.
కొన్ని సెకన్ల తర్వాత సాధారణ స్థితికి రండి.


 పాదహస్తాసనం:
మీ రెండు పాదాలను కలిపి నిలబడండి.
శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి లేపాలి.
శ్వాస వదులుతూ నడుమును వంచి ముందుకు వంచాలి.
రెండు చేతులను పాదాలకు ఇరువైపులా నేలపై ఉంచడానికి ప్రయత్నించండి.
తర్వాత శ్వాస తీసుకుంటూ చేతులను పైకెత్తి సాధారణ స్థితికి రావాలి.


వక్రాసనం:
కాళ్లను ముందుకు చాచి.. చేతులను నిటారుగా ఉంచి నేలపై ఆనించి దండసానాలో కూర్చోవాలి.
రెండు పాదాలు ఆకాశం వైపు ఉంచాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీ కుడి మోకాలిని వంచండి.
కుడి మడమ ఎడమ మోకాలికి దగ్గరగా ఉంచాల్సి ఉంటుంది.
రెండు చేతులను చాచేట్టప్పుడు శ్వాస తీసుకోండి.
శ్వాస వదులుతున్నప్పుడు.. మీ నడుమును కుడివైపుకు తిప్పండి.
కుడి చేతిని తుంటి వెనుకకు ఉంచి.. ఎడమ చేతితో కుడి మోకాలిని పట్టుకోండి.
మెడను వంచి తలను కుడి భుజం వైపు ఉంచాల్సి ఉంటుంది.
శ్వాస తీసుకుంటూ కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి.
ఇప్పుడు శ్వాస వదులుతూ కాస్త విశ్రాంతి తీసుకోండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో


Also Read : Allu Arjun Pushpa : పుష్ప రాజ్‌ను కౌగిట్లో బంధించేసిన స్నేహా రెడ్డి.. అల్లు వారి ప్రేమ.. వైరల్ పిక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook