రివ్యూ: 14
నటీనటులు: నోయల్, విషాక ధీమాన్, రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి, మహేష్ తదితరులు
ఎడిటింగ్: జానకి రామారావు
సంగీతం: కళ్యాన్ నాయక్
సినిమాటోగ్రఫీ: సాయినాథ్
నిర్మాత: సుబ్బారావు రాయన, శివకృష్ణ
దర్శకత్వం: లక్ష్మి శ్రీనివాస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయల్ పిక్చర్స్ పతాకంపై  లక్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో,  సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల  కలిసి నిర్మించిన మూవీ ‘14’.నోయల్, సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి లీడ్ రూల్స్ లో యాక్ట్ చేశారు.  డెబ్యూ నటుడు రామ్ రతన్ రెడ్డి, విషాక ధీమాన్ జోడిగా నటించారు.ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైం థ్రిల్లర్... ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం.


కథ:
రతన్(రామ్ రతన్ రెడ్డి) ముఖ్యమంత్రి(పోసాని కృష్ణ మురళి) కుమారుడు. చాలా జాలీగా తిరుగుతూ స్నేహితులతో ఎంజాయ్ చేసే బ్యాచ్. అతనికి జూనియర్ డాక్టర్ అయిన నేహా(విషాక ధీమాన్)తో  తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరి మనసులు కలుస్తాయి. ఇద్దరూ రొమాంటిక్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఓ రోజు వీళ్లిద్దరూ ఓ ఇంట్లో చచ్చిపడి ఉంటారు. అసలు వీళ్లు ఆత్మ హత్య చేసుకున్నారా.. ? ఎవరైనా హత్య చేసారా.. ?ఈ  క్రమంలో ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రేక్షకులను ఫస్ట్ నుంచి చివరి వరకు ఆడియన్స్ ఎంగేజ్ చేయగలిగేలా ఉండాలి. 14 అనే మూవీని ప్రేక్షకులను కుర్చలో కదలకుండా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడానే చెప్పాలి. కొత్త దర్శకుడే అయినా.. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ గా ఈ సినిమాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఓ సాదాసీదా మర్డర్  వెనక ఉన్న మిస్టరీని ఎలా చేధించారనే విషయాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. అంతేకాదు నెక్ట్స్ సీన్ లో ఏమవుతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. మొత్తంగా 14 అనే టీనేజ్ క్రైమ్ స్టోరీతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గా లక్ష్మీ శ్రీనివాస్ కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు ఫ్యూచర్ లో పెద్ద దర్శకుడు అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ప్రస్తుతం సమాజంలో పెద్దలు చేస పనులు పిల్లలపై ఎలాంటి దుష్ప్రభావాలను చూపిస్తున్నాయనే విషయాన్ని ఈ సినిమాలో సున్నితంగా టచ్ చేసాడు. మధ్యలో యూత్ ను అట్రాక్ట్ చేసే సన్నివేశాలున్నా.. మర్డర్ తర్వాత సినిమాను పరుగులు పెట్టించిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ సోసోగా అనిపించినా.. ఇంటర్వెల్ తో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. ప్రీ క్లైమాక్స్ సహా క్లైమాక్స్ ప్రేక్షకులను సీట్ల నుంచి కదలనీయకుండా చేసాడు.


దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ రాసుకున్న కథతో పాటు కథనాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించడంతో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ ఫస్టాఫ్ తన కత్తెరకు పదును పెడితే బాగుండేది.సినిమాటోగ్రఫీ,నిర్మాణ విలువలు బాగున్నాయి.  నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు.


నటీనటుల విషయానికొస్తే..


హీరో, హీరోయిన్స్ గా నటించిన రతన్, విషాక చాలా రొమాంటిక్ గా నటించి యూత్ ను అట్రాక్ట్ చేసారు. వీరి జంట స్క్రీన్ పై క్యూట్ గా ఉంది. డిటెక్టివ్ పాత్రలో నోయల్ పాత్ర ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. అటు శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర కథలో కీలక మలుపు అని చెప్పాలి. అటు పోసాని సహా మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.


రేటింగ్: 2.75/5


Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook