Yaadein Song: మ్యాడ్స్ గ్రూప్ నుంచి `యాదీన్` సాంగ్ విడుదల..
Abhishek Srivastav Yaadein Song: ది మ్యాడ్స్ గ్రూప్ నుంచి మరో సాంగ్ విడుదలైంది. అభిషేక్ శ్రీవాస్తవ్ నటించిన యాదేన్ సాంగ్‌కు రోహిత్ వర్మ, హిమాన్షు సైనీ, కమల్ త్యాగి మ్యూజిక్ అందించారు. పూర్తి వివరాలు ఇలా..
Abhishek Srivastav Yaadein Song: జర్నలిస్ట్‌గా వివిధ మీడియా సంస్థల్లో తనదైన ముద్ర వేసిన అభిషేక్ శ్రీవాస్తవ్ ఇప్పుడు నటనా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా ది మ్యాడ్స్ గ్రూప్‌లోని కొత్త పాట 'యాదేన్'లో నటించి ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు బాలీవుడ్ మూవీ 'షేడ్స్ ఆఫ్ లైఫ్', 'మెలోడ్రామా మామ్' అనే వెబ్ సిరీస్‌లకు కూడా పనిచేశాడు. ఈ రెండూ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యాయి. 'యాదేన్' సాంగ్‌కు సాహిత్యం, సంగీతం రోహిత్ వర్మ, హిమాన్షు సైనీ, కమల్ త్యాగి అందించారు. ఈ పాటను ది మ్యాడ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయగా.. Spotify, అమెజాన్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్‌తో సహా వివిధ ఆడియో ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.
'యాదీన్స్' సాంగ్ కంటే ముందు.. మ్యాడ్స్ గ్రూప్ 'దేఖ్ భాయ్' పేరుతో మరో పాటను విడుదల చేసింది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 8, ఎపిక్ ఛానెల్‌లో విన్ ఇండియా, జస్ట్ డ్యాన్స్ ఇండియా వంటి రియాలిటీ షోలలో రోహిత్, హిమాన్షు, కమల్ కూడా పాల్గొన్నారు.
ఇక అభిషేక్ శ్రీవాస్తవ్ విషయానికి వస్తే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిల్మ్ & టీవీ స్టడీస్ భారతీయ విద్యాభవన్ (BVBFTS)లో చదువుకున్నాడు. మఖన్ లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం నుంచి యాక్టింగ్‌లో డిగ్రీ, ఎలక్ట్రానిక్ మీడియాలో మాస్టర్స్ పట్టా పొందాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకున్నాడు. ఇతర థియేటర్ గ్రూపుల నటులు, దర్శకులతో కలిసి పనిచేశాడు. మరోవైపు ప్రముఖ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశాడు. మ్యాడ్స్ గ్రూప్ 'యాదీన్' సాంగ్‌తో తన కెరీర్ మలుపు తిరుగుతుందని అభిషేక్ శ్రీవాస్తవ్ చెబుతున్నాడు.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి