National American Miss: అమెరికా అందాల పోటీల్లో సత్తా చాటిన తెలుగు అమ్మాయి హన్సిక..
National American Miss: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ తెలుగుమ్మాయి హన్సిక నసనల్లి ఇపుడు రచ్చ గెలిచి ఇంట సందడి చేస్తోంది. అంతేకాదు తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగరవేశారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో ఈమె విన్నర్ గా నిలిచారు.
National American Miss: హన్సిక నసనల్లి అమెరికాలో రచ్చ చేస్తోంది. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మందిలో ఆమె ప్రత్యేకంగా నిలిచారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు. ఇవే కాకుండా హన్సిక గత రెండేళ్లుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచి నిలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. అంతేకాదు క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటడం విశేషం. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.
మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. చదువులో ఉన్నతస్థాయి లో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.