Honey Moon Express: అమెరికాకు చెందిన న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) తెలుగులో నిర్మిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. హేబా పటేల్, చైతన్య రావు ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రంలో సుహాసిని, తనికెళ్ల భరణి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కెకెఆర్ మరియు బాలరాజ్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు విడుదల చేసారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. దర్శకుడు బాల నాకు కావాల్సిన మనిషి. అమెరికాలో చాలా మందికి సినిమా గురించి ట్రైనింగ్ ఇచ్చి  ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో డీన్ గా పనిచేసాడు. ఇపుడు సొంతంగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ టైటిల్ తో ఈ సినిమాను నిర్మించారు.  పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను ఆలపించింది.  పాట చాలా మెలోడియస్ గా ఉంది. దర్శకుడు బాల కి, నటించిన నటీనటులకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటునన్నారు.  


కే రాఘవేంద్రరావు విషయానికొస్తే.. తెలుగులో శతాధిక చిత్రాలను నిర్మించిన దర్శకుడిగా పేరు గడించాడు. అంతేకాదు తెలుగులో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకుడిగా పేరు గడించాడు. గత కొన్నేళ్లుగా ఈయన దర్శకుడిగా ఏ సినిమాలు చేయడం లేదు. నిర్మాతగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు, టెలి సీరియల్స్ నిర్మిస్తున్నారు. అంతేకాదు థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నారు. ఈయన చివరగా .. నాగార్జున హీరోగా ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.


Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్‌.. కారు షెడ్డుకే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter