మూవీ: ‘గల్లీ గ్యాంగ్ స్టర్’ (రివ్యూ)
నటీనటులు: సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి
సంగీతం: సత్య, శరత్ రామ్ రవి
నిర్మాత: మువ్వ సత్యనారాయణ
నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత: డాక్టర్ ఆరవేటి యశోవర్ధన్
డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ
స్టొరీ మరియు దర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మ
విడుదల తేది: 26-7-2024


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంకటేష్ కొండిపోగు, ధర్మ దర్శకత్వంలో అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టర్స్’. పూర్తి గల్లీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఈ  శుక్రవారం థియేటర్స్ లో సందడి చేసింది. మరి ఈ సినిమా మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే :
నెల్లూరులోని ఓ గల్లీలో గాంధీ, తప్పెట్లు.. మూగోడు.. చెత్తోడు.. కర్రోడు..మరియు క్వార్టర్ అనే ఆరుగురు అనాథలు ఉంటారు. ఈ ఊర్లో ఎప్పటి నుండో తన గుప్పిట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీ షీటర్. అతను అక్కడుండే అనాథలతో డ్రగ్స్ అమ్మించి నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ ఉంటాడు.   గాంధీ అనేవారు గోల్డ్ రెడ్డి అనే వాడి కింద పనిచేస్తూ ఉంటాడు. అతనికో లవర్ ఉంటుంది. ఆ ప్రేమికురాలిని గోల్డ్ రెడ్డి ఏడిపిస్తుంటాడు. ఈ గల్లీ పోరలకు సత్య అని ఓ చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. వాళ్లలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.  ఈ నేపథ్యంలో గల్లి పోరలు.. గోల్డ్ రెడ్డి చేస్తోన్న అరాచకాలపై తిరగబడతాడు. ఈ ఆరుగురు అనాథలు ఎలా కలిశారనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు ఈ సినిమా కథను మన సమాజంలో జరగుతున్న ఘటనల నేపథ్యంలో తెరకెక్కించాడు. ముఖ్యంగా ఓ ఊర్లో ఆరుగురు అనాథలు. వాళ్లను తన ఇష్టమొచ్చినట్టు ఆడించే ఆ ఊర్లో ఓ పెద్ద మనిషి. ఇక అనాథలకు మోటివేట్ చేసే వ్యక్తి ద్వారా తమ తప్పులు తెలుసుకొని తమను ఇంత వరకు ఆడించిన వ్యక్తి పై తిరగబడటం వంటి రొటిన్ గా అనిపించినా.. దాన్ని సరైన విధంగా ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాత ఆరవేటి యశోవర్ధన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వగుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ధర్మ రచయిత, ఎడిటర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ తన బాధ్యతలను చక్కగా చేసాడు. సత్య శరత్ రామ్ రవి సంగీత సారథ్యంలో ఇచ్చిన ఆర్ఆర్, పాటలు బాగున్నాయి.
 
నటీనటుల విషయానికొస్తే..
అంతా కొత్త వాళ్లైన తమ నటనతో మెప్పించారు. సంజయ్ శ్రీరాజ్ గాంధీగా మంచి రోల్ పోషించాడు. ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, మురళి కృష్ణ రెడ్డి వరకు అందరు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.



ప్లస్ పాయింట్స్


సాంగ్స్
ప్రొడక్షన్ వాల్యూస్
లొకేషన్స్


మైనస్ పాయింట్స్


అంతగా ఆకట్టుకోని బీజీఎం
ఫస్ట్ హాప్ లాగ్ సీన్స్
రొటీన్ సీన్స్



రేటింగ్ : 2.75/5


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter