Indian Idol season3: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ఎన్నో  ప్రశంసలు పొందిన పాటల రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ రియాలిటీ షో మూడో సీజన్‌ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.  జూన్ 7 నుంచి ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 ఆహాలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతుంది. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో జ‌రిగింది.
ఈ కార్య‌క్ర‌మంలో...హోస్ట్ శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ ..
'ఇండియన్ ఐడ‌ల్ 3' సీజ‌న్‌లో మ‌ళ్లీ రావ‌టం చాలా చాలా ఆనందంగా ఉంది. 2010 నుంచి ఇప్ప‌టి దాకా ఈ ప్రోగ్రామ్‌తో చాలా ఎమోష‌న్స్ ఎటాచ్ అయ్యిఉన్నాయి. ఈ సీజ‌న్‌కు సంబంధించిన‌ ఆడిష‌న్స్ జ‌రిగినప్పుడు చాలా మంది కేవ‌లం సింగ‌ర్స్ మాత్ర‌మే కాదు.. చాలా మంది సంగీత కళ‌కారులు ఇందులో పాల్గొన్నారు. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 గొప్ప టాలెంట్‌ను తీసుకురాబోతున్నారు. తొలి రెండు సీజ‌న్స్‌ను మించిన టాలెంటెడ్ పర్సన్స్ ఈ మూడో సీజన్‌లో వచ్చినట్టు చెప్పారు.  మూడు నాలుగు నెల‌ల పాటు ఈ మ్యూజిక‌ల్ జ‌ర్నీ కొన‌సాగ‌నుంది. ఆహా నాకు కుటుంబం లాంటిది. మంచి అనుబంధం ఉంది. ఇండియ‌న్ ఐడ‌ల్ జ‌ర్నీతో పాటు న‌టుడిగానూ ఆహాలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాను. ఇలాంటి గొప్ప మాధ్య‌మంలో ఇంకా కొత్త టాలెంట్ ప‌రిచ‌యం కాబోతుండటం ఆనందంగా ఉంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింగ‌ర్ గీతా మాధురి మాట్లాడుతూ..


'ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 2' చేసిన త‌ర్వాత సీజ‌న్ 3కి కాల్ వ‌స్తుంద‌ని నేను అనుకోలేదు. అయితే నాకు ఆహా నుంచి కాల్ వ‌చ్చింది. సీజ‌న్ 3కి చక్క‌గా ఆడిష‌న్స్ ముగిశాయి. మంచి పాటగాళ్లు వ‌చ్చారు. గ‌త సీజ‌న్స్‌లాగా ఈ సీజ‌న్‌లోనూ చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. వాళ్లు ఈ వేదిక ఎలా ఉప‌యోగించుకుని ప్ర‌తిభ‌ను ఎలా చాటుకుంటారనేది చూడాలి.


ఆహా నుంచి రాకేష్ మాట్లాడుతూ..


‘‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ రెండు సీజ‌న్స్‌కు మంచి  రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మూడో సీజ‌న్‌కు అదే రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది.  మేం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చింది. దీనికి ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో గుర్తింపు తేవాల‌నే ఉద్దేశంతో యు.ఎస్‌లో ఆడిష‌న్స్ చేశాము. అక్కడ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సీజ‌న్ గొప్ప‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాన్నారు.  


సింగ‌ర్ కార్తీక్ మాట్లాడుతూ..


ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3లో యంగ్ టాలెంటెడ్ సింగ‌ర్స్ మాత్ర‌మే కాదు.. ఏదో సాధించాల‌నే త‌ప‌న ఉన్న‌వాళ్లు వ‌చ్చారు. సింగ‌ర్స్ మాత్ర‌మే కాదు, మ్యూజిషియ‌న్స్ కూడా వ‌చ్చారు. సీజ‌న్ 3 చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు.  


ఆహా సీఇఓ ర‌వికాంత్ మాట్లాడుతూ..


‘‘ఇండియ‌న్ ఐడ‌ల్ ఎంతో మంది గొప్ప పాటగాళ్లకు అందించే వేదిగా మారడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. త‌మ‌న్‌, కార్తీక్‌, గీతామాధురి, శ్రీరామచంద్ర వంటి వారు మెప్పిస్తున్నారు. ఈ సీజన్ 3లో కేవ‌లం సింగింగ్ టాలెంట్‌తో పాటు కొత్త కొత్త మ్యూజిక‌ల్ టాలెంట్స్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాము.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ..


‘‘గత రెండు సీజన్స్ కంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్ సింగర్స్‌ను ఎంపిక చేశామన్నారు. న‌న్ను న‌మ్మి ఇండియ‌న్ ఐడ‌ల్ లో జ‌డ్జిగా పెట్టిన అర‌వింద్‌కి, ఎంక‌రేజ్ చేసిన త్రివిక్ర‌మ్‌కి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. ప్రీమాంట‌ల్ టీమ్‌కి థాంక్స్‌. నా మ్యూజిషియ‌న్ టీమ్ ఫెంటాస్టిక్ స‌పోర్ట్ ఇచ్చారు. సీజ‌న్ 3 నుంచి గొప్ప టాలెంట్ మనందరి ముందుకు రాబోతుంది. ఇది మాకు ఓ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. అంద‌రికీ థాంక్స్‌. జూన్ 7 నుంచి ఆహాలో ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 ప్రారంభం కానుంది.


  Also Read: Mohanlal: క్రేజీ బ్లాక్ బస్టర్‌ సీక్వెల్‌లో జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్.. ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter