'అక్కడొకడుంటాడు' సినిమా ఫేమ్ శివ కంఠ‌మ‌నేని హీరోగా నటించిన చిత్రం 'మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను'. భ‌ద్రాద్రి మరియు క‌త్తి చిత్రాలకు దర్శకత్వం వహించిన మల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా నటించగా.. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించాడు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో.. జి. రాంబాబు యాదవ్ సమర్పణలో.. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ:


సినిమా పేరులో ఉన్నట్టుగానే మధురపూడి గ్రామంలో.. ఆ ఊరే తన ఆత్మకథ చెప్పుకున్నట్టుగా.. ఆ కోణంలోనే కథ సాగుతుంటుంది. అదే ఊర్లో ఉంటున్న హీరో సూరి (శివ కంఠమనేని) ఓ మొరటోడు, మొండోడు. హీరో సూరి తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వ‌ర‌కైన తెగిస్తాడు. తన స్నేహితుడు బాబ్జీ కోసం ప్రాణాలు ఇవ్వరానికైనా.. తీసుకోటానికైనా వెనుకాడడు. ఒకరకంగా చెప్పాలంటే.. ఇద్దరివీ క‌ర్ణుడు, ధుర్యోదనుడు లాంటి క్యారెక్ట‌ర్లు.  ఇలా ఉన్న హీరో లైఫ్ లోకి.. హీరోయిన్ (క్యాథ‌లిన్ గౌడ) ఎలా వస్తుంది..? హీరోయిన్ ఎంట్రీతో హీరోలో వచ్చిన మార్పులు..? ఊర్లోని రాజకీయాల్లో సూరి పాత్ర ఏంటి..? ఈ కథకు 700 కోట్ల రూపాయ‌ల డిజిట‌ల్ స్కామ్‌కు సంబంధం ఏంటి..? అన్నదే కథ!


ఎవరెలా చేశారంటే..?
కథకు తగ్గట్టుగానే సూరి పాత్రలో శివ కంఠ‌మ‌నేని చక్కగా నటించారు. సాధారణంగా ఈ క్యారెక్టర్ రెగ్యుల‌ర్ హీరోలు చేయలేరు ఎందుకేనట.. ఇలాంటి కథలకు కొత్త తారాగణం అయితేనే సూట్ అవుతుంది. ఎమోషనల్ యాక్షన్ మరియు కామెడీ సీన్లలో హీరో శివ కంఠ‌మ‌నేని అదరగొట్టాడు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కొంచెం వయసుకి మించిన పాత్రలో ఉంటుంది.. క్యాథ‌లిన్ గౌడ చాలా చక్కగా నటించటమే కాకూండా లుక్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ పాత్రకి చివరి 30 నిమిషాల్లో మంచి స్కోప్ దక్కింది. కథలో కీలకమైన పాత్ర హీరో స్నేహితుడు బాబ్జీ.. ఈ పాత్ర మలిచిన తీరు బాగుటుంది. భ‌ర‌ణిశంక‌ర్ త‌న ప‌రిదిలో న‌టించి పాత్ర‌కు న్యాయం చేశారు. వ‌నితా రెడ్డి, జ‌బ‌ర్‌ద‌స్త్ నూక‌రాజు, మ‌హేంద్ర‌న్ వారి వారి పరిది మేర న‌టించారు.  


Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!  


విశ్లేషణ...
ఒకే కథలో పొలిటికల్, రివేంజ్, లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కించటం కష్టమే.. ఈ అంశాలాన్ని కలిపి.. ఒక కమర్షియల్ చిత్రంగా మలచటం సాధారణ విషయం కాదనే చెప్పాలి. ఇవన్నీ జోడించి.. సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వటం అంటే మరీ కష్టం. కానీ ఈ సినిమాలో దర్శకుడు అన్ని రకాల అంశాలను మిళితం చేసి విజయం సాధించారనే చెప్పాలి. వీటితో పాటుగా సినిమా పాత్రలను మలచిన తీరుకూడా అద్భుతం. పాత్రలను ఆడియన్స్ లో రిజిస్టర్ చేయటానికి ప్రథమార్థం అంత సమయం తీసుకుంటాడు.. కాస్త నిదానం అనిపించినా.. మ‌ణిశ‌ర్మ సంగీతం ఆ లోటుకి తీర్చుతుంది. ఇక పాటల విషయానికి వస్తే ఫస్టాఫ్ లో వచ్చే ఎల్లే గోరింక పాట.. సెకండాఫ్ లో వచ్చే లింగా లింగా పాటలు హైలెట్ గా నిలుస్తాయి. ఈ సినిమాకి మణిశర్మ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టింది. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరగటం.. ద్వితీయార్దం ఆకట్టుకునేలా ఉంటుంది. క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. ముఖ్యమంగా క్లైమాక్స్‌లో హీరో పర్ఫామెన్స్, దర్శకుడు తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. 


'మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను' సినిమా ఆకట్టుకుంటుంది.. సురేష్ భార్గవ్ విజువ‌ల్స్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తక్కువ నిడివితో ప్రేక్షకుడ్ని బోర్ కొట్టించకుండా చక్కగా కత్తిరించాడు ఎడిటర్ గౌతంరాజు గారు. ఇక నిర్మాతలు కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్ పెట్టిన ప్ర‌తి రూపాయి తెరపై కనిపిస్తుంది. ప‌ల్లెటూరి విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాని నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లాయి
రేటింగ్ః 2.75/5


Also Read: Oppo Find N3 Flip Price: Oppo Find N3 Flip మొబైల్‌పై రూ. 47,150 వరకు తగ్గింపు..అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం