Prem Kumar Movie Review: పేపర్ బాయ్ సినిమాతో సంతోష్ శోభన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఏక్ మినీ కథ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఎప్పటిప్పుడూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్న సంతోష్ శోభన్ తాజాగా ప్రేమ్ కుమార్ అంటూ వచ్చాడు. ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ
ఏదో ఒక కారణంతో ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్) పెళ్లి ఆగిపోతూనే ఉంటుంది. ఏం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ప్రేమ్ కుమార్‌కు పెళ్లి అవ్వదు. చివరకు పెళ్లిళ్లు చెడగొట్టే, బ్రేకప్‌లు చేయించేలా ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టి నడుపుతుంటాడు ప్రేమ్ కుమార్. మరో వైపు నిత్య (రాశీ సింగ్) పెళ్లిళ్లు చేసే ఈవెంట్ మేనెజ్మెంట్‌ను ప్రారంభిస్తుంది. ఈ ఇద్దరూ దారులు వేరైనా ప్రయాణం ఒకటేలా మారుతుంది..? అసలు వీరిద్దరి పరిచయం ఎలా జరుగుతుంది..? వీరిద్దరి కథలో అంగనా (రుచిత), రైజింగ్ స్టార్ రోషన్ (చైతన్య కృష్ణ)లు ఏం చేశారు? చివరకు ప్రేమ్ కుమార్‌కు పెళ్లి అవుతుందా..? ప్రేమ్ కుమార్ ప్రేమ సఫలం అవుతుందా..? లేదా..? అన్నది థియేటర్లో చూడాల్సిందే.


నటీనటులు
ప్రేమ్ కుమార్ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. సంతోష్ శోభన్‌కు ఇలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలు బాగానే నప్పుతాయి. ఈ ప్రేమ్ కుమార్ కథలోనూ సంతోష్ శోభన్ ఎంతో సహజంగా నటించాడు. ఎమోషనల్ సీన్లైనా, కామెడీ సీన్లైనా సరే సంతోష్ మెప్పించేశాడు. ఇక హీరోయిన్లుగా కనిపించిన రాశీ సింగ్ అందంగా కనిపిస్తుంది. రుచిత వేసిన అంగనా పాత్ర కాస్త డిఫరెంట్‌గా కొత్తగా అనిపిస్తుంది. రైజింగ్ స్టార్ అంటూ నవ్వించాడు. సుదర్శన్, కృష్ణ చైతన్య ఇలా అన్ని పాత్రలు బాగానే ఆకట్టుకుంటాయి.


Also Read: Baby OTT Release Date: బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  


విశ్లేషణ
ప్రేమ్ కుమార్ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండేలా స్క్రిప్ట్ రాసుకున్న దర్శకుడు. మాటలు సరికొత్తగా అనిపిస్తాయి. కామెడీ, సెటైరికల్ పంచులు బాగానే వర్కౌట్ అయ్యాయి. డైరక్టర్, రచయిత ఒకరే కావడంతో కావాల్సినంత లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపించింది. మొదటి సినిమా అయినా దర్శకుడు మాత్రం చాలా చక్కగా తెరకెక్కించాడు. అయితే కొన్ని చోట్ల మాత్రం నీరసం తెప్పించేలా కథనాన్ని సాగించాడు.
ఫస్ట్ హాఫ్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. పెళ్లి కోసం తాపత్రయ పడే కుర్రాడు.. పెళ్లి చూపులు, పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతుండటం ఇప్పటి తరంలోని యువతకు బాగానే కనెక్ట్ అవుతుంటాయి. అయితే ఈ కథ అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు హీరోయిన్ ప్రస్థావన అంతగా అనిపించదు. ఇంటర్వెల్ తరువాత సినిమా మీద అందరికీ ఆసక్తి ఏర్పడుతుంది. వినోదాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఈజీగా పాసైనట్టుగా అనిపిస్తుంది.


ద్వితీయార్థం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా సాగుతాయి. ప్రేమలోని సంఘర్షణను చివర్లో బాగానే ప్రజెంట్ చేశారు. దీనికి తోడు ఆర్ఆర్ కుదిరింది. పాటలు ఓకే అనిపిస్తాయి. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సహజంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి.


రేటింగ్ 2.75


Also Read: Himachal Pradesh: దంచి కొడుతున్న వాన.. 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల నష్టం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి