School Life: పులివెందుల మహేష్ హీరోగా నటిస్తూ.. దర్శకుడుగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’.  సావిత్రి కృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. నైనీషా క్రియేషన్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పులివెందుల మహేష్ ఎంతో కష్టపడి తానే హీరో మరియు దర్శకుడుగా చేస్తున్న సినిమా. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం  మరియు దర్శకుడు వి సముద్ర వచ్చి టీమ్ స్పెషల్ విషెస్ అందజేసారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణానగర్ నుంచి వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే  అందుకు కారణం మీడియా మరియు ప్రేక్షకులు. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు. సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో అలాగే నా ఇల్లు అమ్మి ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ చేస్తారు అని నమ్ముతాను. కష్ట సమయంలో వచ్చి సపోర్ట్ ఇచ్చిన రాహుల్ త్రిశూల్ కు ఈ సినిమాకి నిర్మాతగా ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. 100% సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు.


నిర్మాత రాహుల్ త్రిశూల్  మాట్లాడుతూ...
గతంలో నేను రాంగోపాల్ వర్మ సినిమా స్టోరీకి ఓటిటి కి చేశాను. యాంకర్ రవి హీరోగా రాయలసీమ ప్రేమ కథ అని రెండు సినిమాలు నిర్మించాను. నిర్మాతగా ఇది నాకు మూడవ చిత్రం. మహేష్ నాకు రాయలసీమ ప్రేమ కథ అప్పుడు పరిచయం. ఈ సినిమా గురించి మహేష్  చెప్పినప్పుడు కథ నచ్చి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి నేను కూడా ఒక భాగస్వామి అయ్యాను. ప్రేక్షకులు ఎప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఆదరించి సక్సెస్ చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేసారు. అదే విధంగా బిజీగా ఉండి కూడా అడగగానే సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరంకి దర్శకుడు సముద్రకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.


దర్శకుడు సముద్ర  మాట్లాడుతూ : ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మహేష్ కి రాహుల్ త్రిశూల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాయలసీమ నుంచి వచ్చిన ఎంతోమంది సక్సెస్ అయ్యారు అదేవిధంగా మహేష్ కూడా హీరోగా దర్శకుడుగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.


నటుడు రామ్ మాట్లాడుతూ : నేను గతంలో ఏపీ 04 రామాపురం అనే సినిమాలో నటించాను. ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాలో ఒక మంచి పాత్రలో నటిస్తున్నాను.మహేష్ ఈ సినిమా కథ చెప్పగానే నచ్చి చేయడానికి ఒప్పుకున్నాను.


హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ : ఈ సినిమాలో నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మహేష్ గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదు. ఈ రోజుల్లో సినిమాలకి కంటెంట్ ఇంపార్టెంట్. అలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా స్కూల్ లైఫ్. కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook