Srikanth -4th anniversary program of New Life Physiotherapy: కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్,  న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. హీరో శ్రీకాంత్ ఇక్కడ సేవలు పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలోన్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక  మాట్లాడుతూ - న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ యేడాది సందర్భంగా  5కే రన్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు హీరో శ్రీకాంత్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. రీహాబిలిటేషన్ అంటే సాధారణంగా అందరూ స్మోకింగ్, డ్రింకింగ్ కోసం అనుకుంటారు. కానీ మా సెంటర్ లో స్పైన్ ఇంజూరీ, లెగ్ ఇంజూరీ, పక్షపాతం వల్ల మంచానికే పరిమితమైన వారికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నామన్నారు.  నెలల పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ను చూసుకుంటామని తెలిపారు.  డైపర్ ఛేంజింగ్, ఫుడ్ ఫీడింగ్, వెట్ వైప్స్ తో బాడీ క్లీనింగ్ వంటివి చేస్తున్నట్టు తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు మనం ఇంట్లో పెద్దవాళ్లకు పక్షవాతం వస్తే కుటుంబ సభ్యులే అన్ని సేవలు చేసేవారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అలా చేయడం కుటుంబ సభ్యులకు చేయడం సాధ్యం కావడం లేదు. అలాంటి వారికి మా సెంటర్ లో సేవలు అందిస్తున్నామన్నారు.  ముందు పేషెంట్ కు కౌన్సిలింగ్ చేసి చేర్పించుకుని వీలైనంత త్వరగా వారిని కోలుకునేలా చేసి ఇంటికి పంపిస్తామన్నారు.  మా సెంటర్ ప్రారంభించి నాలుగేళ్లవుతోంది. ఎంతో కాంపిటేషన్ ఉన్నా నా స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల సక్సెస్ ఫుల్ గా సెంటర్ ను నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో సికింద్రాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. మేము చేస్తోన్న కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేమన్నారు.


టీఎఫ్ పీసీ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ..
న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ వారు గత నాలుగేళ్లుగా బెడ్ మీద పేషెంట్స్ కు గొప్ప సేవలు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి మంచి నర్సింగ్ సేవలు ఇస్తున్నారు. వారి సేవలకు వెలకట్టలేమన్నారు.


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..
న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రుషిక ఈ సెంటర్ ను ఎంతో డెడికేటెడ్ గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని కలిసి పరామర్శించాను. పెరాలసిస్ వచ్చిన వారు, రోడ్ యాక్సిడెంట్ లో బెడ్ కు పరమితమైన వారిని చిన్న పిల్లల్లా చూసుకుంటున్నారు. నాకు ఈ సెంటర్ స్టాఫ్ ను చూస్తుంటే దేవతల్లా అనిపించారు. అంత గొప్ప సేవలు తక్కువ ధరల్లో అందిస్తున్నారు. ఇక  కోవిడ్  ఫస్ట్ వేవ్  లో కూడా చాలా  సేవలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోవిడ్   ఫస్ట్ వేవ్ లో కూడా  దాదాపు  100 -150  మందికి   ఉచితంగా   కోవిడ్    టీకాలను   పద్మజ హాస్పిటల్   నుంచి   వేయించారు. కోవిడ్  ఫస్ట్  వేవ్ లో  టీకా  ఉచితంగా  వెయ్యడం   అంటే  మాములు విషయం  కాదన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ పై ప్రేమతో ఆమె  ఒక డైరెక్టర్  గా  ఉంటూ  అలాగే  ఈ  హాస్పిటల్   రన్ చేయడం పద్మజ గొప్పదనాన్ని చూచిస్తోంది.


Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter