Teanagers 17/18: ఆహాలో అందరినీ అట్రాక్ట్ చేస్తోన్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘టీనేజర్స్ 17/18’.. డోంట్ మిస్..
Teanagers 17/18 OTT Streaming: గత కొన్నేళ్లుగా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను ఆహా ఓటీటీగా డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ కోవలో కన్నడ నాట మంచి విజయం సాధించిన ‘టీనేజర్స్ 17/18’ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అక్కడ దూసుకుపోతుంది.
Teanagers 17/18 Aha OTT Streaming: కన్నడలో వచ్చిన ‘హడినెలంటు’ మూవీని తెలుగు ప్రేక్షకుల కోసం ‘టీనేజర్స్ 17/18’ అనే పేరుతో డబ్ చేసారు. ఇపుడీ సినిమా తెలుగు వారి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం రూపొందించారు. ప్రస్తుతం యువత 17 మరియు 18 యేళ్లతో ఎలాంటి విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ లెవల్లో ఎన్నో అవార్డులు వరించాయి. ఇక ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.
మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక నేషనల్, ఇంటర్నేషనల్ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ అట్రాక్ట్ చేస్తూ అనేక అవార్డులను సైతం గెలుచుకుంది.
పృథ్వీ కొననూర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అంతేకాదు ఆయన స్వయంగా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. పాత్రలను పోషించారు. ఇపడీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకల ముందుకు వచ్చింది. ఈ రోజు అర్దరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నా.. ఇప్పటికే మిలియన్ల మినిట్ వ్యూస్‌తో ఈ చిత్రం దూసుకుపోవడం విశేషం. ఇప్పటికే ఆహాలో ఈ సినిమా టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతోంది. ఈ రోజు రేపు నెంబర్ 1 ట్రెండింగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.