Uruku Patela Review and Rating: హుషారు మూవీతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజస్ కంచర్ల.. ఉరుకు పటేల మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం.. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. వివేక్ రెడ్డి దర్శకత్వం వహించగా.. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ పతాకంపై కంచ‌ర్ల బాల భాను నిర్మించారు. ఖుష్బూ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. గోపరాజు రమణ, చమ్మక్ చంద్ర, సుదర్శన్, లావణ్య రెడ్డి, మలక్ పేట శైలజ ఇతర పాత్రలు పోషించారు. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ


పటేల (తేజస్ కంచర్ల) చదువులో అందరికంటే వెనుకుంటాడు. దీంతో పటేలను చూసేందుకు కూడా అమ్మాయిలు ఇష్టపడరు. చదువు అబ్బక.. అమ్మాయిలు చూడక.. పటేల చాలా ఫీలవుతుంటాడు. అలా పెరిగి పెద్దయిన తరువాత పెళ్లి చేసుకుందుకు కూడా అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరు ముందుకు రారు. పటేల తండ్రి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కావడంతో ఆయనకు రాజకీయంగా తోడు ఉంటాడు. సరదాగా సాగిపోతున్న పటేల జీవితంలోకి డాక్టర్ అక్షర (ఖుష్బూ చౌదరి) ఎంట్రీ ఇస్తుంది. ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి పటేలను వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఎలాంటి చదువు సంధ్యల్లేని పటేలను డాక్టర్ అయిన అక్షర ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది..? ఇందులో కుట్ర ఏమైనా ఉందా..? అసలు పటేలను అక్షర నిజంగా ప్రేమించిందా..? పటేల ఎందుకు పరిగెత్తాల్సి వస్తుంది..? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఉరుకు పటేల మూవీ చూడాల్సిందే.


విశ్లేషణ


సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా మూఢ నమ్మకాలతో నరబలి ఇవ్వడం వార్తల్లో చూస్తున్నే ఉన్నాం. అలాంటి వాటిని బేస్ చేసుకుని థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో డైరెక్టర్ కథ రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా పటేల, అక్షర మధ్య లవ్ ట్రాక్‌తో ఉంటుంది. సరదా సన్నివేశాలతో సాగిపోయే సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అక్షర బర్త్ డే కోసం ఆమె ఇంటికి పటేల వెళ్లగా.. తన ఫ్యామిలీతో పటేలను చంపేందుకు అక్షర ప్రయత్నిస్తుంది. వాళ్ల నుంచి పటేల ఎలా తప్పించుకున్నాడు..? అక్షర ఎందుకు చంపాలని అనుకుంది..? అంటూ సాగుతున్న సమయంలో మరో రెండు ట్విస్టులతో ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేశారు. క్లైమాక్స్ ట్విస్టులను ఆడియన్స్ అస్సలు ఊహించలేరు. కథకు యాప్ట్ టైటిల్‌తో సక్సెస్ అయ్యారు.


హుషారు మూవీ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని తేజస్ కంచర్ల ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రథమార్థంలో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో అలరించగా.. ద్వితీయార్థంలో భయపడే పాత్రలో దుమ్ములేపాడు. మూవీని వన్ మ్యాన్ షోతో ముందుకు నడిపించాడు. భయపడుతూనే ఆడియన్స్‌ను తెగ నవ్వించాడు. డ్యాన్సులతో మెప్పించాడు. హీరోయిన్ ఖుష్బూ చౌదరి తన అందంతో ఆకట్టుకుంది. హీరోయిన్ వదిన పాత్రలో లావణ్య రెడ్డి మెప్పించింది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఫైనల్‌గా థ్రిల్లర్, కామెడీ జానర్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేశారు డైరెక్టర్ వివేక్. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్‌గా ఉండగా.. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్లు ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవచ్చు.


రేటింగ్‌: 2.75


Also Read: Kattappa Killed: దారుణంగా 'కట్టప్ప'ను చంపేసిన దొంగ.. కారణం తెలిస్తే షాకవుతారు


Also Read: CM Revanth Reddy: మరో అపచారం.. ఖైరతాబాద్ దగ్గర సీఎం రేవంత్ పూజ చేస్తుండగా.. తెగిపడిన గజమాల.. వీడియో వైరల్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.