Telugu Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్.. అనూహ్యంగా భరత్ భూషణ్ గెలుపు..
Telugu Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన బైలా ప్రకారం ప్రతి యేడాది కొత్త అధ్యక్షులను ఎన్నుకుంటూ ఉంటారు. ఈ సారి ఎన్నికల్లో అనూహ్యంగా భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Telugu Film Chamber: నిన్నటి వరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా ఉన్న దిల్ రాజు పదవి కాలం ముగియడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాతలను కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న్ భరత్ భూషణ్ ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
లాస్ట్ ఇయర్ సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు ఈ పదవి వరించింది. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించారు. ప్రతి యేడాది ఈ యేడాది కూడా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 48 సభ్యులున్న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో 46 మంది సభ్యులు తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో భరత్ భూషణ్ కు 29 ఓట్లు పోలయ్యాయి. ఈయనకు పోటీగా రంగంలోకి దిగిన ఠాగూర్ మధుకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి భరత్ భూషణ్ కు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్య పదవి కోసం సీనియర్ నిర్మాత అశోక్ కుమార్ తో పాటు దర్శక, నిర్మాత వైవీయస్ చౌదరి పోటీ పడ్డారు.
ఈ ఎన్నికల్లో అశోక్ కుమార్ 28 ఓట్లు వస్తే.. వైవీయస్ చౌదరికి మాత్రం 18 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నిర్మాతల నుంచి ఉపాధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సారి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకున్నారు. ఈ ఓటింగ్ లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. స్డూడియో సెక్టార్ లోని సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter