Varun Sandesh Constable Poster Launch: వరుణ్ సందేశ్ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘నిందా’, ‘విరాజి’ వంటి మూవీస్ తో  అలరించిన వరుణ్ సందేశ్.. ఇపుడు ‘కానిస్టేబుల్’ చిత్రంతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను లాంఛ్ చేశారు.  ఈ సినిమాలో వరుణ్ కు జోడిగా మధులిక వారణాసి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ పోస్టర్ ను  నెల్లూరు టౌన్ హాళ్ళో కలెక్టర్ K. కార్తీక్, సినిమా రచయిత యండమురి వీరేంద్ర నాథ్ సహా కొంతమంది ప్రముఖుల చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్బంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. సస్పెన్ క్రైమ్ త్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఈ కోవలో తెరకెక్కిన ‘కానిస్టేబుల్’ ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.


ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, మధులిక వారణాసితో పాటు దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్,  ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, బలగం జగదీష్, శ్రీ భవ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్ అందిస్తున్నారు. శ్రీ వర ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. B. G. M : జ్ఞాని, ఆర్ట్ డైరెక్టర్ : వి. నాని పండు.  మాటలు :శ్రీనివాస్ తేజ అందిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ రాసారు.  వెంకట్ రెడ్డి మేకప్ మ్యాన్ గా వ్యవహరిస్తూన్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా సిరాజ్ వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్: పి. లీల ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం జగ్గయ్య ఉన్నారు. సహ నిర్మాత: బి నికిత జగదీష్, కుపెందర్ పవార్. నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.