Music Director Ajay arasada: అజయ్ అరసాడా మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో అత్త‌, అక్క‌లు వీణ వాయిస్తూ ఉండేవారు. అలా సంగీతం అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటైంది. అందులో ఆసక్తి కలిగించేలా ేసింది.  అలా చిన్నప్పటి నుంచే సంగీతం పై ఓ అవగాహన ఏర్పడింది.  తాజాగాయ ఈయన సంగీతం అందించిన పీరియాడిక్ వెబ్ సిరీస్ విక‌ట‌క‌వి న‌వంబ‌ర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 నేప‌థ్యం..?


విశాఖ పట్నంలో  పుట్టి పెరిగాను. గీతం యూనివ‌ర్సిటీలో ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా  2011 నుంచి 2018వ‌ర‌కు పని చేశాను. ఉద్యోగం రిజైన్ చేసి సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ క్ర‌మంలో నాకు మా కుటుంబం మంచి సపోర్ట్ గా నిలిచింది.  


* మ్యూజిక్ అంటే ఆస‌క్తి ఎందుకు?


చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరు సంగీత కళాకారులు కావడంతో సంగీతంపై ఇష్టం ఏర్పడింది. చిన్నపుడే శ‌ర‌త్‌ మాస్ట‌ర్ ద‌గ్గ‌ర రెండున్న‌ర నెలల పాటు బేసిక్స్ నేర్చుకున్నాను. త‌ర్వాత నాకు నేనుగా సొంతంగా ప్లే చేస్తూ నేర్చుకోవ‌టం స్టార్ట్ చేశాను. గీతం యూనివ‌ర్సిటీలో ఇంజ‌నీరింగ్ జాయిన్ అయిన త‌ర్వాత కాస్త ఎక్కువ స‌మ‌యం దొరికిన‌ట్ల‌య్యింది. కొన్ని సంద‌ర్భాల్లో అయితే కాలేజీల‌కు డుమ్మా కొట్టి మ్యూజిక్ నేర్చుకునేవాడిని.


సినీ రంగంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?


2011 నుంచి 2018 వ‌ర‌కు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తూనే షార్ట్ ఫిల్మ్స్‌కు పనిచేసే వాడిని.  అలా ప్రాక్టీస్ చేయడం వల్ల సంగీతంపై మంచి పట్టు దొరికింది. నేను అంత‌కు ముందు చేసిన ఓ ముప్పై సెక‌న్ల మ్యూజిక్ బిట్ విని నాకు జ‌గ‌న్నాట‌కం సినిమాలో అవకాశం  ఇచ్చారు. అలా సినీ ఇండ‌స్ట్రీలోకి నా తొలి అడుగు ప‌డింది. త‌ర్వాత సొంతగా వ‌ర్క్ చేసుకుంటూ వ‌స్తుండేవాడిని. ఆ స‌మ‌యంలో నా చిన్న‌నాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల న‌న్ను గూఢ‌చారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వ‌ర్క్ చేయ‌మ‌ని అడ‌గ‌టంతో వ‌ర్క్ చేశాను. ఆ త‌ర్వాత క్షీర సాగ‌ర మ‌థ‌నం, నేడే విడుద‌ల‌, మిస్సింగ్, శ్రీరంగ‌నీతులు సినిమాల‌కు పి చేశాను. సినిమాల‌తో వెబ్ సిరీస్‌లైణ‌ సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్1, సీజ‌న్‌2ల‌కు సంగీతాన్ని అందించాను. తాజాగా  విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేశాను.


* ఆయ్ సినిమాలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది?


- నేను సంగీతాన్నందించిన మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎం బిట్ విన్న నిర్మాత బ‌న్నీవాస్‌కి  అది బాగా న‌చ్చింది. ఆయ‌న ఆ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అలా ‘ఆయ్’ సినిమాకు వ‌ర్క్ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించారు.  


* పీరియాడిక్ సిరీస్ విక‌ట‌క‌వి వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ?


- డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలికి ఏం కావాల‌నే దానిపై ప‌క్కా క్లారిటీ ఉంది. అందువ‌ల్ల నేను విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేసేట‌ప్పుడు ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. దర్శకులు  నాకు గురువులు. అందువ‌ల్ల డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలికి కావాల్సిన సంగీతాన్ని అందించగలిగాను. ఏ జోన‌ర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయ‌టానికి సిద్ధ‌మే.


* మీకు ఇన్‌స్పైరింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు?


- దేవిశ్రీ ప్ర‌సాద్‌ అంటే నాకు చాలా ఇష్టం.


* నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?


- ప్ర‌స్తుతం త్రీరోజెస్ సీజ‌న్ 2తో పాటు ఆహాలో మ‌రో రెండు వెబ్ సిరీస్‌ల‌కు పని చేస్తున్నాను. కొన్ని సినిమాల‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియపరుస్తాను.


ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..


ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం