Pen Drive Movie Updates: విష్ణు వంశీ, రియా కపూర్ జంటగా  ఎంఆర్ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ పెన్‌ డ్రైవ్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై కె.రామకృష్ణ నిర్మిస్తున్నారు. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేడు దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు సాయి కుమార్ క్లాప్ నిచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ కె.రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ.. తాను నిన్ననే కథ విన్నానని.. చాలా బాగుందన్నారు. తన పాత్రను కూడా చాలా బాగా రాశారని.. పేరు కూడా చాలా బాగా నచ్చిందన్నారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. మూవీ టీమ్‌కు మంచి పేరు తీసుకురావలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. అతిథిగా విచ్చేసిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. పెన్ డ్రైవ్ చిత్రాన్ని దర్శకుడు ఎంఆర్ దీపక్  ప్రేక్షకులు అందరికీ నచ్చేలా రూపొందిస్తారనే నమ్మకం ఉందన్నారు. నూతన నటీనటులతో తెరకెకకిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని అన్నారు. విడుదల సమయంలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.


హీరో విష్ణు వంశీ మాట్లాడుతూ.. ఈ మూవీ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యాయని.. ఈ సినిమాలో హీరోగా నటించడం సంతోషంగా ఉందన్నారు. పెన్‌ డ్రైవ్ మూవీతో తనకు హీరోగా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హీరోయిన్ రియా కపూర్ మాట్లాడుతూ.. తనది కాన్పూర్ అని.. ఇప్పటికే పలు హిందీ సినిమాల్లో నటించినట్లు చెప్పారు. పెన్ డ్రైవ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండడం హ్యాపీగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు థ్యాంక్స్ చెప్పారు. నిర్మాత కె రామకృష్ణ మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో పెన్ డ్రైవ్ మూవీని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 


డైరెక్టర్ ఎంఆర్ దీపక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం టెక్నాలజీ మనకు ఎంతగానో అందుబాటులోకి వచ్చిందని.. అయితే సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తూ క్రైమ్‌లకు పాల్పడుతున్నారన అన్నారు. టెక్నాలజీ సహకారంతో నేరాలు చేయడం సులువేనని.. కానీ తప్పించుకోవడం చాలా కష్టమన్నారు. టెక్నాలజీని మంచి ఉపయోగించాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇస్తున్నామన్నారు. ఉచితంగా వచ్చే దేనికీ కూడా ఆశపడకూడదని.. అత్యాశకు పోతే ఏం జరుగుతుందనేది చూపిస్తామన్నారు. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామన్నారు. 



టెక్నికల్ టీమ్


==> కాస్ట్యూమ్స్ - కె సాదిక్
==> మేకప్ - బి. రాంబాబు
==> స్టిల్స్ - వెంకటేష్
==> పబ్లిసిటీ డిజైనర్ - శ్రీకాంత్
==> కాస్టింగ్ డైరెక్టర్ - రమేష్ బాబు దాసరి
==> కో డైరెక్టర్ - శ్రీనివాస్ రాయి
==> ప్రొడక్షన్ కంట్రోలర్ - రామ్ దగ్గుబాటి
==> ఆర్ట్ డైరెక్టర్ - సుమిత్ పటేల్
==> ఎడిటర్ - ప్రదీప్ జంబిగ
==> మ్యూజిక్ - వినోద్
==> సినిమాటోగ్రఫీ - విజయ్ టాగూర్
==> పీఆర్ఓ - సురేష్ కొండేటి
==> కో ప్రొడ్యూసర్ - బుజ్జి బొగ్గారపు
==> ప్రొడ్యూసర్ - కె రామకృష్ణ
==> రచన, దర్శకత్వం - ఎంఆర్ దీపక్ (మర్కాపూర్)