పాలు తాగటానికి మారాం చేస్తున్న మూడేళ్ల పాపను ఇంటి బయట వదిలేయగా కనిపించకుండా పోయిన ఘటన టెక్సాస్ లో  చోటుచేసుకుంది. అక్టోబర్ 7వ తేదీ అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు టెక్సాస్ పోలీస్ వర్గాలు తెలిపారు. వారం దాటినా  ఇప్పటికీ కుమార్తె ఆచూకీ తెలియలేదని తండ్రి వాపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం మేరకు వెస్లే మ్యాథ్యు  భారతదేశంలో ఒక అనాథ శరణాలయం నుంచి షెరిన్ అనే చిన్నారిని మూడేళ్ల క్రితం దత్తత తీసుకొని టెక్సాస్ వెళ్ళాడు. అక్టోబర్ 7 వ తేదీన పాలు తాగటానికి మారాం చేస్తుంటే ఇంటి ఆవరణలో చెట్టు వద్ద నిల్చోమని అన్నాడు. పదిహేను నిమిషాల తరువాత వెస్లే చూస్తే పాప అక్కడ లేదు. చుట్టుప్రక్కల వారిని అడిగినా తమకు తెలియదని చెప్పారు. ఇక చేసేదేమీ లేక మ్యాథ్యు పోలీసులను ఆశ్రయించాడు. 


పాపను తప్పకుండా పట్టుకుంటామని, వదిలే ప్రసక్తే లేదని, సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నామని కేసు విచారిస్తున్న సదరు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.  అసలు అంత అర్థరాత్రి పాపను బయటికి ఎందుకు వదిలిపెట్టారని, పాప విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారని పోలీస్ అధికారి వెస్లేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎఫ్బిఐ సహకారంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆచూకీ కనుగొంటామని అన్నారు.