Ap Govt posting for ias Jawahar reddy and Poonam malakondaiah: ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల పరంగా నేతలు, నాయకులు వివాదాలలో, వార్తలలో ఉండటం కామన్ గా జరిగేదే. కానీ ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి తన వివాదాస్పద నిర్ణయాల కారణంగా ప్రతిరోజు వార్తలలో నిలిచేవారు. గతప్రభుత్వానికి ఆయన ఎన్నికలలో అన్నిరకాలుగా విధేయత చాటుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా.. జవహర్ రెడ్డి కన్నా ఎందరు సీనియర్ అధికారులు క్యూలో ఉన్న కూడా ఏరీ కోరి జవహర్ రెడ్డిని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. దానికి తగ్గట్టే ఆయన కూడా స్వామి భక్తిని చాటుకున్నారని టీడీపీ, ఇతర పార్టీలు బహిరంగంగా విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..


ఏకంగా ఐఏఎస్ జవహర్ రెడ్డిని సైతం విధుల నుంచి తప్పించాలని ఏపీలో ఎన్నికల సమయంలో కూటమి నేతలు.. ఈసీకి పలు మార్లు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ క్రమంలో..ముఖ్యంగా కూటమిని వారిని అణచివేసే అధికారులను జిల్లాలలో నియమించడం, ఎన్నికల సంఘానికి వైసీసీ అనుకూల అధికారుల జాబితాను పంపి వారిని నియమించే విధంగా చేయడంలో జవహర్ రెడ్డి తన మార్కు చూపించాడని కూటమి ఎద్దేవా చేస్తు వచ్చింది.ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం మారడంతో జవహర్ రెడ్డిని కొన్నిరోజుల పాటు విధుల నుంచి పక్కన ఉంచారు. ఈ నేపథ్యంలో మరో అధికారిణి పూనం మాల కొండయ్యకు సైతం ఏ శాఖను కేటాయించకుండా పెండింల్ ఉంచారు.


ఈ క్రమంలో ఈనెల ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు  ఈనెల చివర్లో రిటైర్ మెంట్ అవుతున్న వేళ.. వీరికి టీడీపీ సర్కారు తాజాగా, కీలక శాఖలను కేటాయించింది. ఐఏఎస్ జవహర్ రెడ్డికి..  ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కార్యదర్శిగాను,  పూనం మాలకొండయ్యలకు సాధారణ పరిపాలన విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. వీరిద్దరు కూడా ఈనెల 30 రిటైర్ మెంట్ కానున్నారు. సాధారణంగా రిటైర్ మెంట్ ముందు అధికారులకు కీలక శాఖలను కేటాయించి ఏపీ సర్కారు హుందాతనంగా వ్యవహరించింది.


కానీ ఇదే క్రమంలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం.. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించి, కోర్టుకు వెళ్లి మరీ పోస్ట్ తెచ్చుకునే విధంగా వేధించింది. ఈ క్రమంలో తమ ప్రభుత్వం ఎవరిని వేధించదని, కేవలం చట్టపరంగా తప్పులు చేసిన వారిని తగిన విధంగా పనిష్మెంట్ చేస్తామని పలుమార్లు టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.  మరోవైపు.. కేంద్ర సర్వీసుల నుంచి ఏపీ కేటర్ కు పీయూష్ గోయల్ ను సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు.అదే విధంగా ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలాన్ని మరో ఆరునెలల పాటు కేంద్రం పొడించింది. ఈ మేరకు డీవోపీటీ నుంచి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి