New Postal Ballot Voting System By Election Commission | విదేశాల్లో ఉన్న భారతీయ ఓటర్ల కోసం ఎలక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్‌తో ఓటు వేసే అవకాశాన్ని పెంచేవిధంగా భారత ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించింది.  అర్హతగల భారతీయుల కోసంఈ కొత్త విధానం ఉపయోగకరంగా ఉంటుంది అని ఎన్నికల సంఘం భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Voting In Ballot Paper బ్యాలెట్ పేపర్‌ ఓటింగ్ విధానం ఇదే !


న్యాయ మంత్రిత్వ శాఖకు నవంబర్ 27న ఒక లేఖరాసిన ఎన్నికల సంఘం (Election Commission) విధుల్లో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు ఈ కొత్త విధానం ఉపయోగకరంగా ఉంటుంది అని తెలిపింది. సాధారణ ఎన్నికల నుంచి అసెంబ్లీ (Assembly) ఎన్నికల వరకు కూడా ఈ సదుపాయాన్ని భారతీయులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని లేఖలో తెలిపింది.


అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ (Kerala), తమిళనాడు, పుదుచ్చెరిలో 2021 జనవరిలో జరగనున్న ఎన్నికల కోసం ఈ విధానం తీసుకురావడానికి ఎన్నికల సంఘం భావిస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయుల నుంచి ఎన్నికల సంఘానికి వచ్చిన సలహాల మేరకు ఇలా ప్రస్తావన కేంద్రానికి పంపినట్టు తెలిపింది.  



Also Read | Ballot Voting Process: బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేయడం ఎలా ? పూర్తి వివరాలు చదవండి!


విదేశాల్లో ఉన్నందున అక్కడి భారతీయులు ఓటు వేయడానికి మాత్రమే భారతదేశానికి రావడం సాధ్యం కాదు. అలా చేయడం వారికి ఆర్థికంగా కూడా చాలా ఖరీదైన వ్యవహరంగా మారనుంది. దాంతో పాటు కోవిడ్-19 (Covid-19) పరిస్థిత్తుల్లో అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థను వారికి అందుబాటులో తెస్తే వారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook