NRIs Helpdesk at RGIA: విదేశాలకు వెళ్లే తెలుగు వాళ్ల కోసం ప్రవాసి సహాయతా కేంద్రం ఏర్పాటయ్యింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే తెలుగు విద్యార్థులు, ప్రధానంగా ఉపాధికోసం గల్ఫ్‌, మలేషియా వంటి 18 ఈసీఆర్‌ దేశాలకు వలస వెళ్లే కార్మికులకు ఈ ప్రవాసి సహాయతా కేంద్రం సహకరిస్తుంది. ఈ హెల్ప్‌డెస్క్‌ రాత్రీ పగలూ నిరంతరాయంగా పనిచేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్‌తోపాటు.. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ హెల్ప్‌ డెస్క్‌ను నిర్వహించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఈ ప్రవాసి సహాయతా కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ అధికారి నాగభారతి, ఎన్నారై అధికారి చిట్టిబాబు తదితరులు ఈ హెల్ప్‌డెస్క్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్‌ డిపార్చర్స్‌ వద్ద ఈ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు, వలస కార్మికులకు అవసరమైన సమాచారాన్ని ఈ ప్రవాసి సహాయతా కేంద్రంలో అందిస్తారు. సురక్షితమైన, చట్టపరమైన వలసల గురించి అవగాహన పెంపొందిస్తారు. ప్రధానంగా విదేశాలకు వెళ్తున్న నిరక్షరాస్యులు, అవగాహన లేని వాళ్లకు డాక్యుమెంటేషన్ సక్రమంగా ఉందా లేదా పరిశీలించడంతో పాటు.. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు అవసరమైన మార్గనిర్దేశం చేస్తారు. అంతేకాదు.. అవసరమైన సహకారం అందిస్తారు. ఈ క్రమంలోనే అమెరికా (America) వెళ్తున్న విద్యార్థి బేతి యశ్వంత్‌ రెడ్డి, వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి ఈ ప్రవాసి సహాయతా కేంద్రాన్ని సంప్రదించి వాళ్ల సూచనలు, సలహాలను తీసుకున్నారు.


Also read : China Corona: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు... క్వారెంటైన్‌ కేంద్రాల్లో ప్రజలు ఇబ్బందులు


Also read : Telugu Student Died in USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook