అమెరికా పౌరులను మరో హరికేన్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే హార్వే, ఇర్వా తుఫాన్ల వలన అతలాకుతలమైన పలు అమెరికా ప్రాంతాలు ఇప్పుడు మరో హరికేన్ ప్రభావానికి లోను కానున్నాయి. ఇర్మా హరికేను వల్ల ఇప్పటికే నష్టాన్ని చవిచూసిన కరిబీయన్ దీవులను "మారియా" హరికేన్ తాకనుంది. దీని తాకిడి అప్పుడే 175 కిలోమీటర్ల వేగంతో మొదలై ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలో ఈ హరికేన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకటించింది. 


ఇప్పటికే హార్వే, ఇర్మా తుఫాన్ల వలన టెక్సాస్, ఫ్టోరిడా లాంటి ప్రదేశాలు కొంత నష్టాన్ని చవిచూశాయి. అనేక మంది అమెరికన్లు నిరాశ్రయులు కాగా, లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వేలాది ఇళ్లు విద్యుత్ సరఫరాకు దూరమయ్యాయి. ఈ క్రమంలో మరో తుఫాను మారియా రూపంలో రావడం విషాదకరం.