లిక్కర్ డాన్ మాల్యాను హీరోగా కీర్తించిన బ్రిటన్
విజయ్ మాల్యా మాకు హీరో.. మా గ్రామానికి గొప్ప ఆస్తి అంటున్నారు ఆ గ్రామస్థులు. ఏంటీ.. 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి భారత్ నుండి ఇంగ్లాండ్ కు పారిపోయిన వాడినా హీరో అంటున్నది అనుకుంటున్నారా?
విజయ్ మాల్యా మాకు హీరో.. మా గ్రామానికి గొప్ప ఆస్తి అంటున్నారు ఆ గ్రామస్థులు. ఏంటీ.. 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి భారత్ నుండి ఇంగ్లాండ్ కు పారిపోయిన వాడినా హీరో అంటున్నది అనుకుంటున్నారా? అవును అంటున్నది భారత దేశంలో ఉన్న గ్రామస్థులు కాదు.. బ్రిటన్ పౌరులు. వివరాల్లోకి వెళితే..
విజయ్ మాల్యా బెంగళూరు నగరానికి చెందిన ఒక బిగ్ షాట్. ఆయన కింగ్ ఫిషర్ బ్రాండ్ మీద అనేక వ్యాపారాలు చేశారు. ఎన్ని చేసినా పేరు తీసుకొచ్చింది మాత్రం లిక్కరే. అంతా సాఫీగా దర్జాగా కాలుమీదకాలేసుకొని కూర్చొన్న సమయంలో.. ఒక్కసారిగా బ్యాంకులకు ఇవ్వాల్సిన వడ్డీ, అసలు రూ.9 వేల కోట్ల రూపాయలను ఎగొట్టి ఇంగ్లాండ్ లో తలదాచుకుంటున్నాడు. మాల్యాను భారత్ కు అప్పగించాలని భారత ప్రభుత్వం లండన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ఆ కేసును కోర్టు సోమవారం నుండి విచారణకు ప్రారంభించింది.
ఇదిలా ఉండగా, బ్రిటన్ లోని ఒక గ్రామం 'టెవిన్' విజయ్ మాల్యాను హీరోతో పోల్చుతోంది. మాల్యా ఇండియా నుండి పారిపోయి తలదాచుకుంటున్నది ఇక్కడే. ఈ ఊరి జనాభా 2 వేలు. ఈ ఊర్లో ఈయనే ధనవంతుడు. గతేడాది జరిగిన క్రిస్మస్ కు ఆయన లక్షల విలువచేసే క్రిస్మస్ ట్రీ ఇచ్చాడట. ఇలానే అనేక బహుమతులు ఆ ఊరికి ఇస్తున్నాడట. దాంతో మాల్యా అక్కడివారికి ఒక హీరోగా మారిపోయాడు. 'ఆయన ఈ గ్రామానికి ఆస్తి లాంటివారు. ఆయన సమస్యల్లో ఉన్నారని తెలుసు. అయినా డబ్బున్న వాళ్లందరికీ సమస్యలు ఉండవా చెప్పండి. ఆయనను దేశం నుండి పంపించవద్దు.. 'టెవిన్'లోనే ఉండనివ్వండి" అని గ్రామస్థులు కోరుతున్నారట.