అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్- ఐసిజె) జస్టిస్ దల్వీర్ భండారి ఎన్నికయ్యారు. 2012లో ఎన్నికైన ఆయన రీ-ఎలెక్షనన్స్ లో మరోసారి ఎన్నికయ్యారు. దల్వీర్ ఎన్నికను అమెరికా స్వాగతించింది. అయితే వీటో స్వరూపంలో ఎటువంటి మార్పులకు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది.  అమెరికా ఐక్యరాజ్యసమితి (యుఎన్)లో స్వల్ప విస్తరణకు అంగీకరించినప్పటికీ.. వీటోలో మార్పులకు ససేమీరా అంది. ఐసిజె కు భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ భండారి ఎన్నికైనందుకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అభినందనలు తెలిపారు. బ్రిటన్ జడ్జి క్రిస్టోఫర్ గ్రీన్ వుడ్ పోటీ నుంచి విరమించుకోవడంతో ఆయన ఎన్నిక సాధ్యమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు ఐసిజె కు ఎన్నికైన భారతీయులు 


* శ్రీ బెనెగల్ నర్సింగ్ రావు  (1952-1953)


* నాగేంద్ర సింగ్ (1973-1988). ఈయన 'ఐసిజె' కు1985-88 వరకు అధ్యక్షుడు, 1976-79 వరకు ఉపాధ్యక్షుడు


*రఘునందన్ స్వరూప్ పాఠక్ (1989-1991)