స్వాతంత్య్ర ఉద్యమకర్తలు ఎన్నారైలే - రాహుల్
.
న్యూయార్క్: స్వాత్రంత్య ఉద్యమాన్నిప్రముఖులు ఎక్కవ మంది ఎన్నారైలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ఎన్నారై సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాత్రంత్య ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్‌లు ఎన్నారైలేనని ..స్వాతంత్ర ఉద్యమం ఎన్నారైల ఉద్యమంగా రాహుల్ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ పుట్టింది కూడా ఎన్నారైల ఉద్యమం ఫలితంగానేనని వెల్లడించారు.
రాహుల్ ఏమన్నారో ఆయన మాటల్లో చెప్పాలంటే ' స్వాతంత్ర ఉద్యమకానికి నాయకత్వం వహించిన ప్రముఖలందరూ ఎన్నారైలేనని.. మహాత్మాగాంధీ ఒక ఎన్నారై. నెహ్రూ ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు వచ్చారు. అంబేద్కర్, ఆజాద్, పటేల్ వీరంతా కూడా ఎన్నారైలే' 'నేను పేర్కొన్న వ్యక్తుల్లో ప్రతి ఒక్కరు ప్రపంచంలోని ఏదో ఒక మూలకు వెళ్లి అక్కడి పరిస్థితులు అవగాహన చేసుకొని అక్కడి ఆలోచనలు ధృక్పథాలను భారత్‌ను మార్చేందుకు ఉపయోగించారు. ఇలాంటి ఎన్నారైలు వేలమంది ఉన్నారు. గుర్తింపులోకి రానివారు ఇంకెందరో ఉన్నారు. ఉదాహరణకు భారత్‌లో శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చిన వర్గీస్ కురియన్ కూడా ఒక ఎన్నారైనే. ఆయన అమెరికా నుంచి భారత్‌కు వచ్చారు.. మార్పు తెచ్చారు. ఇలా మార్పులు తెస్తున్న ఎన్నారైలు ఎంతోమంది ఉన్నారు. వారందరిని గుర్తించాల్సి ఉంది' అని రాహుల్ అన్నారు.