Revanth reddy in America: డల్లాస్‌లో సందడిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Revanth reddy in America: అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. డల్లాస్‌లో జరిగిన ఉత్సవాలకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌కు అక్కడి నిర్వాహకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
Revanth reddy in America: అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. డల్లాస్‌లో జరిగిన ఉత్సవాలకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌కు అక్కడి నిర్వాహకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సభలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. అవినీతి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసి తెలంగాణకు విముక్తి కల్పిద్దామని పిలుపునిచ్చారు. అమెరికా అభివృద్ధిలో మన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యం ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. యువకులు, విద్యార్థుల ప్రాణత్యాగాలు చూసి చలించిన సోనియా గాంధీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు.
కేసీఆర్ ఆవినీతిని బయటపెట్టేదాకా, తెలంగాణకు విముక్తి కలిగించేదాకా తల తెగి పడ్డా వెనకడుగు వెయ్యబోనన్నారు రేవంత్. ఎక్కడో తెలంగాణలోని మారుమూల పల్లెల్లో పుట్టి అగ్రరాజ్యం అమెరికాలో ఎదిగిన వాళ్లను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమెరికా అభివృద్ధిలో మన తెలుగువాళ్ల భాగస్వామ్యం ఉండడం గర్వకారణమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో టీడీఎఫ్ ఏర్పాటు చేసి ఎంతో కష్టపడ్డారని రేవంత్ గుర్తు చేశారు. అమెరికాలో ఉన్నత స్థాయికి ఎదుగుతూనే.. పుట్టిన గడ్డ అభివృద్ధి కోసం కూడా పాటు పడుతున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షతో చాలా మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని రేవంత్ చెప్పారు. వాళ్ల త్యాగంతో పాటు.. సోనియా గాంధీ దీవెనల వల్లే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏను నడిపించిన కాంగ్రెస్‌పార్టీ ఎన్నో పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ లక్ష్యం కోసమైతే తెచ్చుకున్నామో ఇప్పుడు ఆ ఆశయాలు నెరవేరడం లేదన్నారు రేవంత్. తెలంగాణ కలను సాకారం చేసుకున్న మనం ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాయా లేదా అని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఎన్నారైలు కూడా ఈ విషయంలో దృష్టిపెట్టాలన్నారు తెలంగాణలో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవన్న రేవం్, కేసీఆర్ ఒక్కరి కుటుంబం చేతిలోనే తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందన్నారు. కానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం అప్పులు, ఆత్మహత్యలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాలు లేక నిరుద్యోగులు సతమతమవుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని వనరులన్నింటినీ దోచుకున్నదన్నారు. కేసీఆర్ కుటుంబం బందీఖానా నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తనను చర్లపల్లి జైలులో వేశామని సంబరపడుతున్నారని, త్వరలో కేసీఆర్ కుటుంబం అవినీతిని కూడా నిరూపించి శాశ్వతంగా కేసీఆర్‌ను జైల్లో వేయిద్దామన్నారు. అమెరికాలో తెలుగు వాళ్లు చాలా ఉన్నతస్థితిలో ఉన్నారని, తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, అలాంటి వాళ్లందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, అయితే, తెలంగాణలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. స్వయం పాలన, సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని, ఇప్పుడు కేసీఆర్ కుటంబం నుంచి విముక్తికోసం పోరాడుదామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్నారైలు కాంగ్రెస్‌పార్టీకి అండగా నిలవాలని కోరారు.
Also Read: Vitamin D Benefits: విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి..!!
Also Read: Jyeshtha Purnima Vrat 2022: జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం ఎప్పుడు? దాని ప్రాముఖ్యత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook