Revanth Reddy: అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రవాస తెలంగాణవాదులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. డల్లాస్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి రావాలని  పిలుపిచ్చారు. తెలంగాణ కు విముక్తి కలిగిద్దాం అంటూ అమెరికా గడ్డపై నినదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ లక్ష్యం కోసమైతే ప్రత్యేక రాష్ట్రం తెచుకున్నామో .. తెలంగాణలో ఇప్పుడా లక్ష్యం నెరవేరడం లేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువకుడు ఉద్యోగం లేదని  రైలుకు ఎదురుగా వెళ్లి  ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అలాంటి సంఘటనలు తెలంగాణలో రోజు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని రేవంత్ విమర్శించారు. కేసీఆర్, కొడుకు, అల్లుడు, బిడ్డ, సద్దకుడి కొడుకు, బంధువులు, చుట్టాలు వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణను బందీ చేశారని ఆరోపించారు.  తెలంగాణ ప్రజలకు మాత్రం అప్పులు, ఆత్మహత్యలే  మిగిలాయన్నారు. ఉద్యోగాలు లేవు.. సకాలంలో జీతాలు లేవు.. ముసలోళ్ళకు పెన్షన్లు లేవని చెప్పారు. 60 ఏళ్ళు తెలంగాణలో అన్ని వనరులు అభివృద్ధి చేస్తే కేసీఆర్ కుటుంబం అన్నింటినీ దోచుకుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.


కేసీఆర్ కుటుంబం బందీఖానా  నుంచి తెలంగాణను విడిపించాల్సి ఉందన్నారు రేవంత్ రెడ్డి.  కేసీఆర్ అవినీతిని నిరూపించి శాశ్వతంగా కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేద్దామని పిలుపిచ్చారు. కేసీఆర్ పై పోరాటంలో తల తెగి పడ్డా వెనకడుగు వేయను అన్నారు రేవంత్ రెడ్డి.  అవినీతి కేసీఆర్ కుటుంబాన్ని జైళ్లో వేసి తీరుతానని శపథం చేశారు. ఎన్నారైలు తమకు సహకరించాలని కోరారు. ఆత్మ గౌరవం, స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచుకున్నామన్నారు. కేసీఆర్ కుటుంబ బానిస బతుకు నుంచి విముక్తి కోసం కొట్లాడుదామని తెలిపారు. మా వెంట మీరు ఉండండి.. తల తెగి పడ్డ వెనుకడుగు వేసేది లేదని అమెరికా గడ్డ నుంచి శపథం చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ కు విముక్తి కలిగిద్దామని పిలుపిచ్చారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఎన్నారైలను కోరారు. తెలంగాణకు మంచి రోజులు తెచ్చే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.


ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి అమెరికాలో ఎంతగానో ఎదిగిన మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. అమెరికా అభివృద్ధిలో తెలంగాణవాసుల భాగస్వామ్యం ఉండడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం టీడీఎఫ్  ఏర్పాటు చేసి తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల త్యాగం, సోనియమ్మ దీవెన వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. దశాబ్దాల కల సాకారం చేసిన సోనియమ్మ కు తెలంగాణలో అధికారంలోకి తెచ్చి బహుమతి ఇవ్వాలన్నారు. తాను చందాల కోసమో.. ఓట్ల కోసమే అమెరికా రాలేదన్నారు రేవంత్ రెడ్డి.


READ ALSO: Charminar Bhagya Laxmi Temple: చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆలయానికి కాంగ్రెస్ నేతలు.. పాతబస్తీలో హై టెన్షన్


READ ALSO: CM KCR: ఉమ్మడి ఏపీకి కేసీఆర్ సీఎం కావాలనుకున్నారా?చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook