Australia: ట్రెక్కింగ్ చేస్తూ కాలుజారి లోయలో పడి ఏపీ వైద్యురాలు మృతి.. ఆస్ట్రేలియాలో ఘటన
AP Young Doctor Died In Australia: సరదాగా స్నేహితులతో విహార యాత్రకు వెళ్లగా ట్రెక్కింగ్ చేస్తూ యువతి జారిపడింది. పై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలతో ఆ యువతి మృతి చెందింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరగ్గా.. ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.
AP Doctor: స్నేహితులతో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతి ట్రెక్కింగ్ చేస్తూ పొరపాటున కాలుజారి కిందపడింది. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. వైద్య చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఆ యువ డాక్టర్ మృతి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ప్రమాద వార్త తెలియగానే ఏపీలోని కృష్ణా జిల్లా ఉంగుటూరులో విషాద వాతావరణం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: Mandapam Collapse: శివ శివా.. మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. శ్రీశైలంలో కూలిన మండపం
ఉంగుటూరుకు చెందిన వేమూరు మైథిలి, వెంకటేశ్వర రావు కుమార్తె ఉజ్వల (23) ఆస్ట్రేలియాలో వైద్య అభ్యసించింది. గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాయల్ బ్రిస్బేన్ మహిళల ఆస్పత్రిలో ఉజ్వల వైద్యురాలిగా పని చేస్తుండేది. తల్లిదండ్రులతోపాటు ఉజ్వల నివసిస్తుండేది. ఈనెల 2వ తేదీన స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లింది. లామింగ్టన్ జాతీయ పార్క్‌లో యంగబూచి జలపాతం సమీపంలో ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా కాలు జారడంతో ఉజ్వల అమాంతం లోయలో పడిపోయింది. ఈ పరిణామంతో తోటి స్నేహితులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also Read: Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ సంచలనం.. తల్లి పేరు చేర్చుకుని 'సాయి దుర్గ తేజ్' పునఃనామకరణం
వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి ఉజ్వల మృతదేహాన్ని వెలికి తీశారు. దాదాపు ఆరు గంటలపాటు కష్టపడి బాడీని లోయలో నుంచి తీశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఉజ్వల మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. శనివారం ఉజ్వల మృతదేహాన్ని ఏపీలోని ఉంగుటూరుకు తీసుకురానున్నారు. బంధుమిత్రుల సందర్శన అనంతరం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కెమెరా కిందపడిపోవడంతో దాన్ని తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఉజ్వల కాలు జారిపడిందని తెలిసింది. ఎదిగి వచ్చిన కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతున్నది. త్వరలోనే వివాహం చేయాలని చూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబం శోకంలో మునిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook