Telugu Woman Jaahnavi Kandula Died: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఒక తెలుగమ్మాయి అక్కడి పోలీసు వాహనం ఢీ కొని మరణించింది. సౌత్ లేక్ యూనియన్‌లోని సీటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం సోమవారం రాత్రి ఢీకొనడంతో 23 ఏళ్ల పాదచారి మరణించినట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, సౌత్ లేక్ యూనియన్‌లో సోమవారం రాత్రి పెట్రోలింగ్ వాహనం ఢీకొన్న ఘటనలో 23 ఏళ్ల పాదచారి మరణించినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమెను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందులగా గుర్తించారు. వాహనం ఢీ కొనడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యి మరణించింది. ప్రమాదానికి కారణమైన అధికారి వివరాలను పోలీసులు వెల్లడించ లేదు. ట్రాఫిక్ కొలిజన్ ఇన్వెస్టిగేషన్ ప్తు స్క్వాడ్ నుండి డిటెక్టివ్ లు ఈ సంఘటనను విచారణ జరుపుతున్నారు. జాహ్నవి సోమవారం రాత్రి 8 గంటల తర్వాత డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసుల వాహనం ఢీకొట్టింది.


కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ ఆ మహిళను జాహ్నవి కందులగా గుర్తించారు. సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి మెడికో టీమ్ వచ్చే లోపు ఆమెను బతికించేందుకు అధికారులు సీపీఆర్ చేశారు. వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, వారు ఆమె ప్రాణాలను రక్షించే చర్యలను చేపట్టారు. ఈ క్రమంలోనే జాహ్నవి కందులను హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు, అక్కడ ఆమె మరణించింది. సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అభ్యర్థన మేరకు డ్రైవింగ్ చేస్తున్న పోలీసు అధికారి ఒక ఎమర్జన్సీ కాల్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక సదరు అధికారి నవంబర్ 2019 నుండి డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారని, ఢీకొనడానికి దారితీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు.


ఇక ఈ సంఘటన గురించి సమాచారం ఉన్న ఎవరైనా 206-684-8923కి కాల్ చేయవలసిందిగా కోరారు. నిజానికి అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం వెళుతున్న అనేక మంది తెలుగు వారు, భారతీయులూ తరచూ చనిపోతూనే ఉన్నారు. గన్ కల్చర్, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని లెక్కలు చెబుతున్నాయి. కన్నవారిని పుట్టిన ఊరిని వదిలేసి సముద్రాలు దాటి.. విదేశాల్లో కెరీర్ డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంతో మంది భారతీయులు ఇలాంటి మరణాల బారిన పడడం బాధాకరం. ఇలాంటి మరణాలతో.. ఇండియాలో ఉండే వారి కన్నవారు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.


Also Read: Rajamouli on Naatu Naatu: చరణ్, ఎన్టీఆర్ టార్చర్ పెట్టినందుకు సారీ.. రాజమౌళి ఎమోషనల్ నోట్ వైరల్!


Also Read: Vijay Antony Health: విజయ్ అంటోనీ ఫాన్స్ కు గుడ్ న్యూస్... సర్జరీ సక్సెస్.. ఆల్ సెట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook