డొనాల్డ్ ట్రంప్ ఎన్ని సంస్కరణలు చేసినా.. వీసాల విషయంలో తగ్గేది లేదంటున్నారు భారతీయులు. అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో వలస విధానాలపై, వీసాలపై సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..! ఎన్ని సంస్కరణలు చేసినా.. ఆ దేశం పట్ల భారతీయుల మోజు తగ్గటం లేదు. 2016 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 46.1 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం దక్కించుకున్నారు. అమెరికా పౌరసత్వం దక్కించుకున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో మెక్సికో (1.03 లక్షలు), భారతదేశం రెండవ స్థానములో నిలిచింది. మొత్తం పౌరసత్వాల్లో భారతీయుల వాటా 6%. క్రితం ఏడాదితో పోలిస్తే.. అమెరికా పౌరసత్వం దక్కించుకున్న  భారతీయులు 9. 41% శాతం పెరిగారు. ఈ విషయాలన్నీ అమెరికాలోని హోంల్యాండ్ భద్రతా విభాగం తెలిపింది.