WhatsApp ప్రైవసీ పాలసీతో నెంబర్ 1గా నిలిచిన మరో మెసేజింగ్ యాప్
జనవరి 2021లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన నాన్-గేమింగ్ యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది. మొత్తం డౌన్‌లోడ్‌లలో 24 శాతం భారతదేశం నుండి కావడం గమనార్హం. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ 63 మిలియన్ల డౌన్‌లోడ్ అయింది. కేవలం భారతదేశంలో జనవరి నెలలో 15 మిలియన్ల మంది కొత్తగా టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు.
టిక్‌టాక్(TikTok) గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్ ఇన్‌స్టాల్‌లతో అత్యధికంగా ఇన్‌స్టాల్స్‌లో రెండవ నాన్-గేమింగ్ యాప్‌గా అవతరించింది.
సిగ్నల్ టెక్నాలజీ ఫౌండేషన్ మరియు సిగ్నల్ మెసెంజర్ LLC రూపొందించిన సిగ్నల్ యాప్ జనవరిలో డౌన్‌లోడ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్నెట్ సహాయంతో పాఠాలు, చిత్రాలు మరియు వాయిస్ రూపంలో సందేశాలను పంపడానికి ఈ మెస్సేజ్ యాప్‌ను వినియోగిస్తారు.
మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్(Facebook) యాప్ గత కొంతకాలం నుంచి కాస్త వెనుకంజ వేస్తుంది. అయినప్పటికీ అతిపెద్ద సోషల్ మీడియా మాధ్యమాలో ఒకటిగా ఉన్న ఫేస్‌బుక్ అత్యధిక డౌన్‌లోడ్లలో టాప్4 అయింది.
ప్రైవసీ పాలసీ ప్రకటన కారణంగా డిసెంబర్ నెలలో మూడవ స్థానంలో ఉన్న మెసేజింగ్ యాప్ WhatsApp జనవరి నెలలో రెండు స్థానాలు దిగి ఐదవ స్థానానికి పడిపోయింది
ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ఫోటో మరియు వీడియో-షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.
కాలిఫోర్నియాకు చెందిన జూమ్ యాప్ ఈ జాబితాలో 7వ స్థానాన్ని సాధించింది. ఇది టెలికాన్ఫరెన్సింగ్, టెలికమ్యూనిటింగ్, మీటింగ్స్, రాజకీయ నాయకులు సైతం కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయాలలో ఈ యాప్‌ను వినియోగించారు.
టైమ్స్ గ్రూప్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం ఎంఎక్స్ టకాటాక్(MX Takatak) ఎనిమిదో స్థానాన్ని పొందింది. నెలవారీ 7 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు దీని సొంతం.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు ఇవాన్ స్పీగెల్, బాబీ మర్ఫీ మరియు రెగ్గీ బ్రౌన్ రూపొందించిన స్నాప్‌చాట్(Snapchat) ఈ జాబితాలో తొమ్మిదవ స్థానాన్ని పొందింది.
ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ఫేస్‌బుక్ మెసేంజర్ (Facebook Messenger) జనవరి 2021లో అత్యధికంగా జరిగిన యాప్ డౌన్‌లోడ్స్‌లో 10వ స్థానంలో నిలిచింది.