Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Tue, 05 Jan 2021-9:39 am,

ఇతర దేశాల్లో ఉన్నట్లుగానే భారత్‌లో సైతం ఎస్‌బీఐ(SBI) సహా పలు బ్యాంకులు వారి ఖాతాదారులకు క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. అయితే అందులో మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలో గుర్తించండి.  మీకు క్రెడిట్ కార్డుల గుంచి ఎక్కువగా తెలియకపోతే తక్కువ వార్షిక రుసుముతో, కొద్ది మొత్తంలో లిమిట్ ఉండే క్రెడిట్ కార్డు తీసుకోవాలి. 

Also Read: SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి

మొదట క్రెడిట్ కార్డ్(Credit Cards) వాడకం తెలుసుకోవడానికి తక్కువ లిమిట్ కార్డ్ తీసుకోవాలి. మీరు మీ క్రెడిట్ కార్డును వాడకం, బిల్లు చెల్లింపులు లాంటి పూర్తి వివరాలపై ఓ అవగాహన వచ్చిన తర్వాత మీ క్రెడిట్ పరిమితిని పెంచే అవకాశాన్ని బ్యాంక్ అనుమతిస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను బ్యాంకు ఆ మేరకు పెంచుతుంది.

డెబిట్ కార్డుల కన్నా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డుకు సంబంధించిన అన్ని నిబంధనలు మరియు షరతుల గురించి తెలుసుకోవాలి. బిల్లు చెల్లింపుల తేదీలు, సంబంధిత ఛార్జీలు, రివార్డులు మరియు, లేట్ ఫీ ఏ మోతాదులో పడుతుంది అనే సమాచారం గురించి తెలుసుకోండి.

Also Read: ​EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే.. మీ ఖాతా కలిగి ఉన్న బ్యాంకు ఉద్యోగులు మీకు కాల్ చేసి మీ ఆదాయ వివరాలు తెలుసుకుంటారు. అప్పుడు మీరు మీ ఆదాయం ఎలా వస్తుంది, మీరు బిల్లులు చెల్లించగలుగుతారని.. మీకు ఏ మేరకు క్రెడిట్ కార్డు లిమిట్ కావాలో తెలియజేయండి. మీరు నెలా నెలా సంపాదన ఉన్నవారైతే క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించగలుగుతారని బ్యాంక్ విశ్వసిస్తుంది.

మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును డెబిట్ కార్డ్ ద్వారాగానీ లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. సకాలంలో చెల్లించడం వల్ల అదనపు ఛార్జీలు ఉండవు. మీరు బిల్లు చెల్లించాల్సిన గడువు తేదీని గ్రేస్ పీరియడ్ అని పిలుస్తారు. ఆ గ్రేస్ పీరియడ్ తేదీ పూర్తయ్యేలోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించని పక్షంలో బాకీ ఉన్న మొత్తానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది.

మీరు మీ క్రెడిట్ కార్డు రుణాన్ని పూర్తిగా చెల్లించని పక్షంలో గ్రేస్ పీరియడ్ తర్వాత వెంటనే మీరు వడ్డీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు APR (వార్షిక శాతం రేటు) రేటు ప్రకారం మీరు పేర్కొన్న గడువులోగా చెల్లిస్తే సరి. సాధారణంగా APR అనేది 30-40 వరకు ఉంటుంది. 

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!

మీరు వినియోగించుకున్న క్రెడిట్ కార్డు నగదు మొత్తాన్ని నిర్ణీత బిల్లు గడువు ముగిసేలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే తరువాత చెల్లిస్తే జరిమానా విధిస్తారని తెలుసుకోండి. కానీ రుణదాతలు మీ బకాయిల వివరాలను క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలకు బహిర్గతం చేయవచ్చు. దీనివల్ల మీ క్రెడిట్ కార్డ్ స్కోరు తగ్గుతుంది. సకాలంలో బిల్లు చెల్లిస్తే మీరు బెటర్ క్రెడిట్ స్కోరును కలిగి ఉంటారు.

మీ క్రెడిట్ స్కోరు అనేది క్రెడిట్ కార్డుపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆర్థిక ప్రాధాన్యతలను మరియు రుణ రికవరీని నిర్ణయిస్తుంది. మీరు డిఫాల్ట్ క్రెడిట్ కార్డ్ లిమిట్ కన్నా ఎక్కువ బిల్లు చెల్లిస్తే అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలుసుకోండి.

Also Read: SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు

మీ క్రెడిట్ లిమిట్‌తో సంబంధం లేకుండా మీరు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారంటే.. సాధ్యమైనంత త్వరగా దానిని చెల్లించాలి. క్రెడిట్ వినియోగ పరిమితి మీ క్రెడిట్ కార్డ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. మీరు మీ క్రెడిట్ కార్డు లిమిట్‌కు మించి 30-40 శాతం కన్నా ఎక్కువ ఉపయోగిస్తుంటే, మీ క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. 

క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే కార్డుకు సంబంధించి అన్ని ఫీజులు, వార్షిక రుసుములు, ఫైనాన్స్ ఛార్జీలు, బదిలీ ఫీజులు, నగదు ముందస్తు రుసుములు, విదేశీ లావాదేవీల రుసుములు, ఓవర్-లిమిట్ ఛార్జీలు, లేట్ ఫీజు వంటి విషయాలపై అవగాహనా పెంచుకోవాలి. ఈ వివరాలు తెలుసుకున్నాక క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీరు సులువుగా వినియోగించుకోవచ్చు. 

Also Read: Secured Credit Card: మీతో సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి ఎవరికి ఇస్తారో తెలుసా!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link