Chaturgrahi Yogam Effect: చతుర్గ్రాహి యోగం- ఈ రాశులకు దెబ్బ మీద దెబ్బ.. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం!!

Fri, 27 Sep 2024-1:23 pm,
Chaturgrahi Yogam In Virgo

చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలిసి వచ్చినప్పుడు ఏర్పడే విశేషమైన ఖగోళ సంఘటన. ఇది ఎంతో ప్రత్యేకమైనది.  ఈ యోగం ఏర్పడినప్పుడు రాశుల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు నమ్ముతారు.  

Solar Eclipse October Date

చతుర్గ్రాహి యోగం ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు వంటి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన శక్తులు ఉత్పత్తి జరుగుతుంది. ఇది మన జీవితాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

Solar Eclipse October

 ప్రస్తుతం అక్టోబర్ రెండున సూర్యుడు, బుధుడు, చంద్రుడు, కేతువు గ్రహాలు కన్యారాశిలో కలవనున్నాయి. అంతేకాకుండా ఇదే రోజు చివరి సూర్య గ్రహణం కూడా ఈ రాశిలో జరగబోతుంది. ఈ రోజు కొన్ని గ్రహాలు వివిధ రాశిలో సంచరిస్తాయి. ముఖ్యంగా  బృహస్పతి వృషభ రాశిలో మిథున రాశిలో కుజుడు సంచరిస్తున్నారు.   

అయితే చతుర్గ్రాహి యోగం  కన్యా రాశి, తులా రాశి,  కుంభ రాశి, మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అనే విషయాల గురించి  మనం ఇక్కడ తెలుసుకుందాం. 

 కన్యా రాశి:  చతుర్గ్రాహి యోగం వల్ల కన్యా రాశివారికి కొత్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.  వృత్తి, ఉద్యోగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతారు. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు ఉన్నప్పటికి శాంతితో పరిష్కరిస్తారు.   

తులా రాశి: ఈ యోగం జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చు. అధిక ఖర్చు ఉంటుంది. కాబట్టి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. ప్రేమ జీవితంలో కొత్త మలుపులు తిరగవచ్చు. అంతేకాకుండా జీర్ణశయ సమస్యలు కలగి అవకాశం ఉంది. 

కుంభ రాశి: కుంభ రాశి వారి సృజనాత్మకత మరింత పెరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందలు ఉండవు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి మంచితనంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. స్నేహితుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.    

మీన రాశి: చతుర్గ్రాహి యోగం వల్ల ఈ రాశివారికి  అధిక భావోద్వేగాలు మానసిక ఒత్తిడికి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులను సులువుగా నమ్మడం మంచిది కాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link