2024 Indian Movies Top Gross Openings: 2024లో కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ఖాతాలో మరో రికార్డు..
2024లో కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ఖాతాలో మరో రికార్డు.. ఈ మూవీ 2024లో మన దేశంలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో టాప్ 3లో నిలిచింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. గత నెల 27న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 191 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2024లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
2024 సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా తొలి రోజు రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా మన దేశంలోనే మొదటి రోజు రూ 58.0 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర్ 2 ప్లేస్ లో నిలిచింది.
హృతిక్ రోషన్ హీరోగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఫైటర్’. ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో రూ. 35.65 కోట్ల గ్రాస్ వసూల్లతో 2024 లో టాప్ 4కి పడిపోయింది.
అక్షయ్ కుమార్ , టైగర్ ఫ్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన సినిమా ‘బడే మియా ఛోటే మియా’. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 32 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2024లో టాప్ 5లో నిలిచింది.
తేజ సజ్జ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 6లో నిలిచింది. .
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ ‘టెల్లు స్క్వేర్’. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 23.70 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 7లో నిలిచింది.
అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘షైతాన్’. ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.75 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 8లో నిలిచింది.