Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..
కార్తీకం, మార్గశిరంతో పాటు సంక్రాంతి మరక జ్యోతిని దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలలో కొలువైన అయ్యప్పను సందర్శించుకోవడానికి వెళుతుంటారు.
అయితే.. రైల్వే శాఖ కేటాయించిన సాధారణ రైళ్లు అయ్యప్ప భక్తులకు చాలడం లేదు. పైగా సీజన్ లో టికెట్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది.
అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలను చూసి రైల్వే శాఖకు శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే 26 స్పెషల్ రైళ్లలను నడపనున్నట్టు ప్రకటించింది.
డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30 జనవరి 01 పై తేదిల్లో అందుబాటులో ఉండనున్నాయి. అయ్యప్ప భక్తులు ఈ స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
మరోవైపు విమానాల్లో ప్రయాణించి అయ్యప్ప దర్శనానికి వచ్చే అయ్యప్ప స్వాములకు విమానాశ్రయాల్లో చెకింగ్ ఇబ్బందులు లేకుండా ఇరుముడితో కొండెక్కే భక్తులకు కఠిన నిబంధనలు సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం స్వాములు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే అవకాశాన్ని కేంద్రం కల్పించిన సంగతి తెలిసిందే కదా.