26/11 Mumbai attack: ముంబై దాడిలో 5 మంది హీరోలెవరు ? అసలేం జరిగింది?

Thu, 26 Nov 2020-12:37 pm,

ముంబై ఏటీఎస్ ఛీఫ్ హేమంత్ కర్కరే...నవంబర్ 26 రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఉగదాడి సమాచారం తెలియగానే..డ్రైవర్, బాడీగార్డ్ ను వెంటబెట్టుకుని సీఎస్టీ స్టేషన్ కు బయలుదేరి వెళ్లి పోయారు. అక్కడికి వెళ్లాక..తీవ్రవాదులు కామా ఆసుపత్రి వైపు వెళ్లారని తెలిసింది.ఏసీపీ అశోక్ కామ్టే, ఇన్ స్పెక్టర్ విజయ్ సాల్స్కర్ తో కలిసి బాధ్యతలు తీసుకున్నారు. కామా ఆసుపత్రి ముందు జరిగిన ఎన్ కౌంటర్ లో తీవ్రవాదుల తుపాకీ గుళ్లకు బలై..అమరుడయ్యారు. మరణానంతరం అశోక్ చక్ర అవార్డు  అందించారు.

ముంబాయి పోలీసు శాఖలో ఏసీపీగా పనిచేస్తున్న అశోక్ కామ్టే..కామా ఆస్పత్రి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ఏటీఎస్ ఛీఫ్ హేమంత్ కర్కరేతో కలిసి ఉన్నారు. కామా ఆస్పత్రి బయట ఇస్మాయిల్ ఖాన్ అనే తీవ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ బుల్లెట్ తలకు తగిలింది. దెబ్బ తగిలినా ప్రత్యర్దని మట్టుబెట్టి తను ప్రాణాలొదిలారు.

 

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 26/11 దాడుల సందర్బఁగా మిషన్ ఆపరేషన్ బ్లాక్ టోర్నడో కు నేతృత్వం వహించారు. తాజ్ హోటల్ వద్ద ఉగ్రవాదులతో జరిగిన దాడులో అమరుడయ్యారు. 2009లో ఆయనకు అశోఖ్ చక్ర అవార్డులో గౌరవించారు.

 

ముంబాయి పోలీసు శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్న తుకారాం ఓంబ్లే తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ..ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను..ఏ ఆయుధం లేకుండానే ఎదుర్కొని అతన్ని పట్టుకున్నాడు. ఈ సందర్బంగా..కసబ్ అతనిపై జరిపిన కాల్పుల్లో ప్రాణత్యాగం చేశాడు. తుకారాం ఓంబ్లేకు అత్యున్నత వీరత్వపు అవార్డు అశోక్ చక్ర అందించారు.

 

విజయ్ సాల్స్కర్ ముంబై పోలీసు శాఖలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఖ్యాతి గాంచిన ఆఫీసర్. కామా ఆస్పత్రి వద్ద జరిగిన ఎన్ కౌంటర్  సమయంలో ఏటీఎస్ ఛీఫ్ హేమంత్ కర్కరే, అశోక్ కామ్టేతో కలిసి ఉన్నారు. దాడి సమయంలో కసబ్ , అతని అనుచరులు కాల్పులు జరిపిన వాహనంలో ఉన్నారు. ఈ దాడిలో అమరుడైన విజయ్ సాల్స్కర్ కు అశోక్ చక్ర అందించారు.

 

ఈ ఐదుమంది వీరులే కాకుండా..గజేంద్ర సింహ్, నాగప్ప ఆర్ మహాలే, కిశోర్ కే షిండే, సంజయ్ గోవిల్కర్, సునీల్ కుమార్ యాదవ్ లు కూడా తమ వీరత్వాన్ని ప్రదర్శించారు. వీరితోపాటు తాజ్ హోటల్  జనరల్ మేనేజర్ కరమ్ బీర్ సింహ్ కాంగ్ కూడా సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో ఎందరివో ప్రాణాలు కాపాడారు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link