Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!
ఓ వ్యక్తిని తండ్రిలా భావిస్తే.. ఇక ఎప్పటికీ ఆయనపై అదే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఓ యువతి మాత్రం అతని ప్రేమలోనే పడి పెళ్లి చేసుకుంది.
ఇంతకు ఎవరు ఆ యువతి..? ఎలా ఆయనను ప్రేమించింది..? వారి పెళ్లికి పెద్దలు అంగీకరించారా..? వివరాలు ఇలా..
డైలీ స్టార్ కథనం ప్రకారం.. రేలిన్ సోలెరో అనే యువతి ఇంట్లో పని మనిషిగా ఆ వ్యక్తి చేరాడు. ఆమెను చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేశాడు.
ఆ యువతి కూడా అతడిని తండ్రిగానే భావించింది. ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవాడు.
దీంతో క్రమంగా రేలిన్ సోలెరోలో అతనిపై ప్రేమ పుట్టింది. తాను ఆయనను తండ్రిలా భావించానని.. అయితే ప్రేమలో ఉన్నానని గ్రహించినట్లు ఆమె చెప్పారు.
తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా.. కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలిపారు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.
ఆ వ్యక్తికి అంతకుముందే పెళ్లి అయి పదకొండేళ్ల కుమార్తె ఉంది. ఆమెను కూడా రేలిన్ సోలెరో బాగా చూసుకుంటున్నారు.
తమ పెళ్లి గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నా.. అవేమి పట్టించుకోనని చెబుతున్నారు. తాము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు.