Ananya Sharma: 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య అందానికి నెటిజన్లు ఫిదా!
అనన్య శర్మ 7 మే 2001లో తెలంగాణలోని వరంగల్‌లో జన్మించింది. 8వ తరగతి వరకు కరీంనగర్‌లో చదివింది. 9వ, 10వ తరగతిని బెంగళూరులో చదివారు. ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్‌కి వచ్చారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఇంజినీరింగ్‌లో 4వ సంవత్సరం చదువుతోంది.
2021లో అనన్య శర్మ గర్ల్ ఫార్ములా అనే యూట్యుబ్ చానెల్‌లో “30 వెడ్స్ 21” అనే వెబ్ సిరీస్‌లో నటించి యూట్యుబ్ స్టార్‌గా నిలిచారు. తన నటనతో ఈ వెబ్ సిరీస్‌తో చాలా పాపులర్ అయ్యింది.
2020లో అనన్య శర్మ తన స్నేహితుడు హర్షిత్ రెడ్డి ద్వారా చాయ్ బిస్కెట్‌లో అవకాశం పొందింది. బాయిస్ ఫార్ములా అనే యూట్యుబ్ చానెల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. "బ్రదర్ అండ్ సిస్టర్ టేల్స్" అనే షార్ట్ ఫిల్మ్‌తో తన నటన జీవితాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, కన్నడల్లో 'లాలిపాప్' అనే పాటతో ప్రేక్షకుల నుంచి మంచి మన్ననలు పొందారు అనన్య శర్మ. ప్రస్తుతం ఇప్పుడు ఆ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం తెలుగు యూట్యూబ్ స్టార్ అనన్య శర్మ అంటే తెలియని ప్రేక్షకులుండరు. “30 వెడ్స్ 21” వెబ్ సిరీస్ నుంచి మంచి ప్రేక్షకాదారణ పొందిన అనన్య ఇప్పుడు యూట్యూబ్ ఫేమ్‌గా మంచి స్థాయిలో నిలిచింది.