Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ బిల్డింగ్.. సూరత్ డైమండ్ బోర్స్‌ ప్రత్యేకతలు ఇవే..!

Sun, 17 Dec 2023-8:15 pm,

ఈ సముదాయం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించగా.. 65 వేల మంది వ్యాపారాలు చేసుకునేలా  కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు 700 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి చేశారు.  

గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి దగ్గరలో ఉన్న ఖాజోడ్‌ గ్రామంలో ఈ బిల్టింగ్‌ను నిర్మించారు. 4,200కి పైగా వర్క్‌ప్లేస్‌లు ఉన్నాయి. ఒక్కో ఆఫీసు 300 నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉన్నాయి. తొమ్మిది టవర్లు.. ఒక్కొక్కటి 15 అంతస్తులతో ఉన్నాయి.  

డైమండ్ ల్యాబ్, వజ్రాలు, పాలిష్ చేసిన వజ్రాల అమ్మకం, వజ్రాల తయారీలో ఉపయోగించే పరికరాలు, డైమండ్ ప్లానింగ్ కోసం సాఫ్ట్‌వేర్, డైమండ్ సర్టిఫికెట్ కంపెనీలతో సహా అన్ని వజ్రాల సంబంధిత కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలకు ఎస్‌డీబీ నిలయంగా మారనుంది.  

వేలం పద్ధతిలో ఇక్కడ కార్యాలయాలను కేటాయించగా.. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న అనేక మంది వ్యాపారస్తులు ఇక్కడ తమ సంస్థలను ప్రారంభించనున్నారు.  

 2015 ఫిబ్రవరిలో అప్పటి గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ పటేల్‌ ఎస్‌డీబీకి భూమిపూజ చేయగా.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.   

దాదాపు రూ.3,200 కోట్లతో నిర్మించారు. 4 వేల సీసీ కెమెరాలు, స్మార్ట్ గేట్లను ఏర్పాటు చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link