5 Coffee Benefits: కాఫీ రోజూ తాగితే డయాబెటిస్, ఫ్యాటీ లివర్, బీపీ తగ్గుతాయా
అల్జీమర్స్ ప్రారంభదశలో ఉంటే చెక్
ఓ అధ్యయనం ప్రకారం అల్జీమర్స్ ప్రారంభదశలో ఉంటే కాఫీతో లాభాలుంటాయి. కాఫీ తాగేవారిలో అల్జీమర్స్ ముప్పు తక్కువే అని ఈ అధ్యయనంలో తేలింది.
విటమిన్ ఇ, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం
అధిక రక్తపోటుతో బాధపడేవాళ్లు కాఫీ తాగితే ఉపశమనం కలుగుతుంది. కాపీతో పోలిస్తే గ్రీన్ టీ ఇంకా మంచిది. పార్కిన్సన్, అల్జీమర్ వ్యాధిగ్రస్థులకు సైతం కాఫీ మంచి లాభదాయకం.
రోజుకు ఒక కప్పు కాఫీ
రాత్రి నిద్రించడానికి 5-6 గంటల ముందు కాఫీ తాగకూడదు. గర్భిణీ మహిళలు రోజుకు 1-2 కప్పుల కాఫీ మాత్రమే తాగాలి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవాళ్లు గ్రీన్ టీ తాగితే చాలా మంచిది.
డయాబెటిస్, బీపీకు చెక్
కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, కరోనరీ ఆర్టరీ డిసీజెస్, స్ట్రోక్, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, క్రానిక్ కిడ్నీ రోగాలే కాకుండా కొన్ని కేన్సర్ రకాలు కూడా తగ్గవచ్చు. రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం మంచిదే. అంతకుమించి తాగకూడదు.
కాఫీతో ప్రయోజనాలు
కాఫీకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. కాఫీతో ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. అయితే షుగర్ లేకుండా తక్కువ పాలతో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజకు 2-3 కప్పుల కాఫీ తాగితే మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ ముప్పు తగ్గుతుంది.