Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే

Tue, 18 Aug 2020-4:29 pm,

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు తమ కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్లపై 6 నుంచి 7 శాతం వరకు వడ్డీ (IDFC First Bank Interest Rates) అందిస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 500 రోజులవరకైతే 7శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకైతే 7.50శాతం వడ్డీ వస్తుంది. కానీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 కలిగి ఉండాలి. Image: IDFC First Bank Twitter

ఆర్‌బీఎల్ బ్యాంకు 4.75శాతం నుంచి 6.75శాతం వరకు సేవింగ్స్ ఖాతాలతో వడ్డీ ఇస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ రూ.500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది. ఈ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే రెండేళ్లవరకు డిపాజిట్లపై 7.20శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 7.70శాతం వడ్డీ అందిస్తోంది.    Photo: Reuters

బంధన్ బ్యాంకులో 4 నుంచి 7.15 శాతం వరకు వడ్డీ అందిస్తారు. అయితే మనిమమ్ బ్యాలెన్స్ రూ.5000 వరకు సేవింగ్స్ ఖాతాలో ఉండాలి.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4 నుంచి 7 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. అయితే మినిమం బ్యాలెన్స్ రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4 నుంచి 6.5 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ లాంటి నిబంధనలు లేవు.   Photo: ZeeBiz

లక్ష్మీవిలాస్ బ్యాంక్ 3.25శాతం నుంచి 6 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. అయితే మినిమం బ్యాలెన్స్ రూ.500 నుంచి రూ.1000 వరకు కలిగి ఉండాలి.   Photo: Youtube

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link