Diwali Rangoli Designs: దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకునే రంగోళి డిజైన్లు

Fri, 25 Oct 2024-9:46 pm,
5 Beautiful Rangoli Designs for this Diwali 2024

Artificial Rangoli Design

మీకు సమయంతో పాటు తగిన వస్తువులు లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ డిజైన్ అమర్చుకోవచ్చు. దీనికోసం మీక్కావల్సిందల్లా ఆర్టిఫిషియల్ పూలు. కొన్ని గాజులు, ఆర్టిఫిషియల్ దీపాలు, మీకు నచ్చినట్టుగా లేకపోతే ఇలా ఈ ఫోటోలో చూపించినట్టుగా అమర్చుకుంటే చాలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది.

5 Beautiful Rangoli Designs for this Diwali 2024

Spiral Rangoli Design

ఇది అత్యంత సులభమైందే కాకుండా వేగంగా వేయగలిగే రంగోళి డిజైన్. దీనికోసం 3-4 రంగులు కావల్సి ఉంటాయి. ఒక టూత్ పిక్ అవసరం. టూత్ పిక్ సహాయంతో రంగులు వెదజల్లవచ్చు. ఈ రంగోళి పెద్దదిగా ఉంటుంది. ఇంటికి అందాన్ని తెచ్చిపెడుతుంది

Leafy Rangoli Design

ఆకులతో రంగోలి డిజైన్ మరో బెస్ట్ ఆప్షన్. ఇందులో ఆకుపచ్చ ప్రధాన రంగు. మరో 2-3 రంగులుంటాయి. ఇతర రంగులు కూడా వాడవచ్చు. ఆకుల ఆకృతిపై దీపాలు అమర్చుకోవచ్చు.

Floral Rangoli Design

రంగులతో ముగ్గులు వేయడంలో నిష్ణాతులైతే ఈ డిజైన్ బాగుంటుంది. ఇందులో యూనిట్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంటుంది. మల్టీ కలర్స్ ఉంటాయి. ఎక్కువ స్థలం ఉంటే డిజైన్ మరింత ఆకర్షణీయంగా వస్తుంది. అంచుల్లో దీపాలు అమర్చుకోవచ్చు. 

Flower Rangoli Design

రంగులతో మంచి రంగోళి డిజైన్ వేయలేకుంటే పువ్వులతో రంగోళి వేయవచ్చు. దీనికోసం పసుపు, ఆరెంజ్ రంగుల్లోని బంతి పూలు అద్భుతంగా పనిచేస్తాయి. దీనికితోడుగా లిల్లీ పూలు, గులాబీలు ఉండాలి. పూవుల్ని వృత్తాకార వరుసల్లో అమర్చుకోవాలి. సింగిల్ ఫ్లవర్ రంగోలి అద్భుతంగా ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link