Lunching Soon: 500 కిలో మీటర్ల మైలేజీతో మార్కెట్లోకి రెండు Ev కార్లు.. ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..
టాటా తర్వాత ఎక్కువ సేల్ అవుతున్న కంపెనీలో హ్యుందాయ్ తో పాటు భారత ఆటోమొబైల్ కంపెనీ మారుతి కూడా ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఒకదానికొకటి పోటీ పడుతూ వరుసగా కొత్త కొత్త కార్లను విడుదల చేస్తూ వస్తున్నాయి.
త్వరలోనే ఈ రెండు కంపెనీలు మరో కారుని కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ కారణం ఎలక్ట్రిక్ వేరియంట్లలోనే అతి తక్కువ ధరలో అందుబాటులోకి రానన్నాయి. అయితే ఈ కార్లెంటో వాటికి సంబంధించిన విడుదల తేదలు, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
త్వరలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి eVX అనే హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కారు మార్కెట్లోకి లాంచ్ అయితే మారుతి సుజుకి విడుదల చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అవుతుంది. దీనిని కంపెనీ వచ్చే సంవత్సరంలోని మొదటి నెలలో లేదా రెండవ నెలలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ కారు ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మారుతి సుజుకి eVX కారును ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మారుతి సుజుకి కంపెనీ ఈ కారుకు సంబంధించిన ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
హ్యుందాయ్ కంపెనీ గతంలో విడుదల చేసిన క్రెటా మోడల్కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. ఇది ప్రీమియం ఫీచర్లతో అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి రావడం వల్ల చాలామంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఈ మోడల్ ను కంపెనీ మరోసారి ఎలక్ట్రిక్ వేరియంట్ లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
ఇక ఈ క్రెటా కారు కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ లో మార్కెట్లోకి లాంచ్ అయితే దాదాపు టాటా కార్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్లతో పోటీపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారుకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే దీని ధర రూ. 20 లక్షలకు పైగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మైలేజీ వివరాల్లోకి వెళితే.. మారుతి సుజుకి విడుదల చేసి ఎలక్ట్రిక్ కారుకు సమానంగా ఉంటుంది