5th Phase Lok Sabha Polls 2024: రాజ్‌నాథ్, రాహుల్, స్మృతి ఇరానీ సహా అదృష్టం పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు వీళ్లే..

Sun, 19 May 2024-8:37 am,

రాజ్‌నాథ్ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి .. బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ లోని లక్నో లోక్‌సభ సీటు నుంచి మరోసారి ఎంపీగా బరిలో దిగారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఈ పార్టీ కీలకనేత రాహుల్ గాంధీ.. కేరళలోని వాయనాడ్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అన్ని ఎత్తులు వేస్తోంది. అక్కడ 1977., 1998, 1999లో ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.

స్మృతి ఇరానీ.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మూడో సారి అమేఠీ నుంచి బరిలో ఉన్నారు. 20014లో ఓటమి చూసిన స్మృతి ఇరానీ.. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. ఈ సారి ఈమె ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ తరుపున కిషోరి లాల్ శర్మ బరిలో ఉన్నారు.

పీయూష్ గోయల్

కేంద్ర మంత్రి బీజేపీ రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ మొదటిసారి మహారాష్ట్రలోని ముంబై నార్త్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.

ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు.

 

చిరాగ్ పాశ్వాన్

లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు దివంగత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లోని హాజీపూర్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.

సాధ్వీ నిరంజన్ జ్యోతి

భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన సాధ్వీ నిరంజన్ జ్యోతి ఫతేపూర్  స్థానంన ఉంచి మూడోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link