7th Pay Commission Big Update: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, వచ్చే నెల మొదటి వారంలో డీఏ పెంపు ప్రకటన
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా మహమ్మారి సమయంలో 18 నెలల డీఏ పెండింగులో ఉంది. అది ఇప్పటికీ చెల్లించలేదు. డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పట్నించో డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం 18 నెలల బకాయిలపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.
అదే జరిగితే డీఏ 54 శాతం అవుతుంది. నిబంధనల ప్రకారం డీఏ 50 శాతం దాటితే మొత్తం డీఏను బేసిక్ శాలరీలో కలిపి తిరిగి జీరో నుంచి లెక్కిస్తారు. కానీ ఈసారి అలా చేస్తారా లేక 54 శాతం డీఏ ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
అయితే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ ఎంత పెరుగుతుందనేది నిర్ణయమౌతుంది. ఈసారి డీఏ 3-4 శాతం ఉండవచ్చని ఉద్యోగులు అంచనా వేస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు 4 శాతం డీఏ పెరగవచ్చని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు రెండో విడత జూలై డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉండవచ్చని తెలుస్తోంది. అటు పెన్షనర్లకు డీఆర్ పెంపు ఉంటుంది. మొత్తానికి దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి లభించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా 2 సార్లు పెరుగుతుంది. జనవరి, జూలై నెలల్లో ఈ పెంపు ఉంటుంది ఈ ఏడాది జనవరిలో 4 శాతం డీఏ పెరగడంతో 50 శాతానికి చేరుకుంది. జనవరి డీఏ పెంపు ప్రకటన మార్చ్‌లో వెలువడింది.