7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. దసరాకు ముందే మోదీ సర్కారు కీలక అప్ డేట్.. డీఏ ఏకంగా..
కొన్నిరోజులుగా దేశంలో విపరీతమైన ద్రవ్యోల్బణం పెరిగింది. ఏది కొనేందుకు చూసిన కూడా మండిపొతున్నాయి. నిత్యవసరాలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు మార్కెట్ లో ధరలు పెరిగినట్లు శాలరీలు మాత్రం పెరగడంలేదని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం చాలా అవస్థలు పడుతున్నారు.ఇక ప్రస్తుతం దేశంలో ఏడొ వేతన సవరణ డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
కేంద్రం ప్రతి ఏడాది రెండు మార్లు డీఏ పెంపును ప్రకటిస్తుంది. జవవరి మాసం, జులై మాసం. డీఏ పెంపు అనేది ఎప్పుడు ప్రకటించినప్పటికి.. జనవరి, జులైమాసంలను ప్రామాణికంగా తీసుకుంటారు. దీన్ని బట్టీ ఉద్యోగులకు డీఏ పెంపుదల ఉంటుంది. మరోవైపు.. ఉద్యోగుల జీతభత్యాలు పరిశీలించడానికి కేంద్రం ప్రతి పదేళ్లకు ఒకసారి సెంట్రల్ పే కమిషన్ ను ఏర్పాటు చేస్తుంది.
ఏడో వేతన సంఘాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేశారు. ఇది నవంబర్ 19, 2015న తన నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో.. ఏడవ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. దీన్ని అనుసరించి.. ఇప్పటికే కేంద్రం ఉద్యోగులకు డీఏ 4శాతం పెంచడంతో.. 50 శాతానికి చేరుకుంది.
ఇదిలా ఉండగా.. మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపుపై ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి మాత్రం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు పండగకు ముందే గుడ్ న్యూస్ చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఆశించిన దానికన్నా కూడా.. ఎక్కువ డీఏ ఇవ్వాలని కూడాప్లాన్ చేస్తుందంట.
ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు... ఈసారి డీఏ పెంపు 3 నుంచి 5 వరకు కూడ ఉండొచ్చని వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా డీఏ పెరుగుదలతో.. అన్నింటికితో కలిపి 54 శాతం లేదా 55 శాతం పెంపుదల కూడా ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతుంది.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) పొడిగించినట్లు తెలుస్తోంది. ఎల్‌టీసీలో జమ్మూ కాశ్మీర్, లడఖ్, అండమాన్, నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశానికి వెళ్లాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్లు గడువును పొడింగించినట్లు తెలుస్తోంది.
కేంద్రం.. ఈ ప్రాజెక్టు కాలవ్యవధిని రెండేళ్లు పొడిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈశాన్య భారతదేశం, జమ్మూ మరియు కాశ్మీర్, అండమాన్, నికోబార్ దీవులు, లడఖ్‌లకు ప్రయాణించడానికి నాలుగు సంవత్సరాల వ్యవధిలో 'హోమ్ టౌన్ LTC'ని కూడా ఇతర ప్రదేశాలకు సైతం మార్చుకొవచ్చు. దీని వల్ల ఆ ప్రాంతాలన్నింటికి వెళ్లేందుకు అవకాశం లభిస్తుందని కేంద్రం వెల్లడించింది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలను Zee Mediaధృవీకరించలేదు)