7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు
డియర్‌నెస్ అలవెన్స్ పెంచిన కారణంగానే వచ్చే ఏడాది జూన్ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం జూలై నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌లను సవరిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) కారణంగా ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఈ ఏడాది డియర్‌నెస్ అలవెన్స్ శాతాన్ని తగ్గించిన కేంద్రం.. ఆ తర్వాత 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ అందించింది. అంతేకాకుండా ఎల్టీసీ, ఎల్టీఏలనూ పెంచింది.
డిఏ తగ్గిందన్న నిరుత్సాహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే కేంద్రం అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది.
ఎల్టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్ ( LTC cash voucher scheme ) శాతాన్ని సైతం పెంచినట్టు కేంద్రం అక్టోబర్ 12న వెల్లడించింది.
కేంద్రం తరహాలోనే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెరిగిన డిఏ ఫలాలు ( DA benefits ) అందనున్నాయి.